Begin typing your search above and press return to search.

బ్ర‌హ్మోత్స‌వం మ‌ళ్లీ మొద‌లైంది

By:  Tupaki Desk   |   5 Oct 2015 5:09 AM GMT
బ్ర‌హ్మోత్స‌వం మ‌ళ్లీ మొద‌లైంది
X
ప్రిన్స్ మ‌హేష్ హీరోగా శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో బ్ర‌హ్మోత్స‌వం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ముగ్గురు క‌థానాయిక‌ల‌తో ముచ్చ‌టైన ఫ్యామిలీ రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్‌ ని ప్లాన్ చేశాడు ద‌ర్శ‌కుడు. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు ను మించిన క‌ల‌రింగుతో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నాడ‌న్న‌ది ఇండ‌స్ర్టీ టాక్‌. బ్ర‌హ్మోత్స‌వం చిత్రంలో కీల‌క‌మైన ఫ్యామిలీ అట్మాస్పియ‌ర్ లో పోష్‌ సంగీత్‌ సాంగ్‌ ఒకటి అప్ప‌ట్లో తెర‌కెక్కించారు. ఇక ఇప్పుడు రామోజీ ఫిలింసిటీలో సిస‌లైన బ్ర‌హ్మోత్స‌వం మ‌ళ్లీ మొద‌ల‌వుతోంది.

ఓ భారీ ఇల్లు సెట్ వేసి అందులో కీరోల్స్‌ తో సీన్స్ తెర‌కెక్కించనున్నాడు శ్రీకాంత్ అడ్డాల‌. ఈరోజు నుంచి మ‌హేష్ ఆన్‌ సెట్స్‌ కి వెళుతున్నాడు. వచ్చే 18 వరకు ఇక్కడే షూటింగ్‌. ఫిలిం సిటీలోని హౌస్ సెట్‌ లో షూటింగ్ జ‌రుగుతుంది. ప్రిన్స్ ఆన్‌ సెట్స్ కి వెళుతున్నాడంటే అది అంద‌రికీ పండుగే. ఈ ద‌స‌రా పండ‌గ బ్ర‌హ్మోత్స‌వం యూనిట్‌ కి కాసింత ముందుగా వ‌చ్చినట్టే. ఎదిగినా ఒదిగి ఉండే హీరో మ‌హేష్‌. స్పాట్ బోయ్ నుంచి అందరినీ గౌర‌వించే, అభిమానంగా చూసుకునే హ‌రోగా పేరు తెచ్చుకున్నాడు. డీసెంట్ ఫ్యామిలీ మ్యాన్‌ గా పాపుల‌ర్ అయ్యాడు. కాబ‌ట్టి ఈ బ్ర‌హ్మోత్స‌వం లో ఆ విలువ‌ల్ని చూపిస్తాడ‌నే భావిద్దాం.

అన్న‌ద‌మ్ములు - అక్క జెళ్లెల్లు - మ‌ర‌ద‌ళ్లు -బావ‌లు.. ఇలా ఇల్లంతా క‌న్నుల‌పండువ‌గా క‌నిపిస్తుందేమో చూడాలి. ఇప్పటికే బెంగుళూర్‌ గాళ్‌ ప్రణీత.. మరో తెలుగు లేడీ చాందిని చౌదరి షూటింగ్‌ సెట్‌ లో జాయిన్‌ అయిపోయారు. ఇక స్టారీ లేడీలు సమంత - కాజల్‌ మాత్రం రావల్సి ఉంది. మొత్తానికి వచ్చే సంవత్సరంలో తీసుకొచ్చే సినిమాకు కూడా ఎంత పక్కా ప్లానింగ్‌ తో మన మహేష్‌ దూసుకుపోతున్నాడో చూడండి.