Begin typing your search above and press return to search.

మగాళ్ళకు సైతం మూడ్ తెప్పించే అందం ప్రిన్స్ ది

By:  Tupaki Desk   |   9 Aug 2015 9:51 AM IST
మగాళ్ళకు సైతం మూడ్ తెప్పించే అందం ప్రిన్స్ ది
X
తెలుగు సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్స్ ఆమెదగ్గర హీరో అందం గురించి పొగుడుతుంటే తక్కిన ఏ హీరోకన్నా ఎబ్బెట్టుగా అనిపిస్తుందేమోగానీ మహేష్ విషయంలో ఇంకా ఉపమానాలు రాసుంటే బాగుండుననిపిస్తుంది. ఘట్టమనేని మహేష్ బాబు... 40వసంతాలు గడిచిన నిత్య యవ్వనుడి ఛాయతో ప్రేక్షకులనేకాకా ప్రతీఒక్కరినీ ఆశ్చర్యపరుస్తున్న పేరు.

సూపర్ స్టార్ కృష్ణగారి వారసుడిగా ఈ 'రాజకుమారుడు' సినిమా రంగంలో హీరో గా ప్రవేశించక ముందే బాలనటుడిగా పలు సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించాడు. అయితే మహేష్ కి తనకంటూ ఇమేజ్ ని , ఫ్యాన్స్ ని తీసుకొచ్చిన చిత్రం 'మురారి'. కృష్ణవంశీ టిపికల్ టేకింగ్ స్టైల్ కి మహేష్ నునులేత హీరోయిజం తోడై సంచలనాలు సృష్టించింది. ఇక మహేష్ కి తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ని తీసుకొచ్చిన సినిమా 'ఒక్కడు'. గుణశేఖర్ కెరీర్ బెస్ట్ గా నిలిచిన ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం.

ఆ తరువాత అడపాదడపా యావరేజ్ లు, ఫ్లాపులకు మధ్య కొనసాగుతున్న మహేష్ కెరీర్ ని ఒక్కసారిగా తారాస్థాయికి చేర్చేసిన చిత్రం 'పోకిరి'. కృష్ణమనోహర్ గా మన పండు గాదు పలికిన డైలాగులు, నటించిన తీరు యువతకు ఊపిరాడనివ్వలేదు. పోకిరి తరువాత కొన్ని ఫ్లాపులతో సతమతమైనా డైరెక్టర్ యాక్టర్ గా, కొత్త కధలను అంగీకరిస్తూ మధ్యలో దూకుడు వంటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఆ మధ్య విడుదలైన 1, ఆగడు నిరాశపరిచినా ఈ ఏడాది తన పుట్టినరోజు కానుకగా అందించిన శ్రీమంతుడు మంచి విజయం సాధించడంతో మహేష్ తో పాటూ అతని అభిమానులు ఖుషిగా వున్నారు.

కధల ఎంపికలోనేకాదు నటనకు కొలమానంగానూ మహేష్ నిలిచారు. దీనికి అతను అందుకున్న నందులే నిదర్శనం. తేజ వంటి చిన్న డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన ఏకైక పెద్ద హీరో.. తొలి సినిమా ఫ్లాప్ అయినా త్రివిక్రమ్ పై భరోసా ఇచ్చి అతడుకి కార్యరూపం కావడం మహేష్ డేరింగ్ నెస్ కి ఉదాహరణలు. ఇవన్నీ ఒకెత్తు అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఒకెత్తు .. సాధారణంగా అందగాళ్ళకు అమ్మాయిలు అభిమానులవుతారు. అయితే ఈ నూనుగు మీసాల నవ మన్మదుడి అందానికి అబ్బాయిలు సైతం జోహార్ అంటారు. బ్రహ్మదేవుడు మంచి మూడ్ లో వున్నప్పుడు మహేష్ ని పుట్టించుంటాడు. ఏమంటారు?