‘ఎన్టీఆర్ కు ప్రేమతో..’ మహేష్ బర్త్ డే విషెస్..

Sun May 20 2018 17:21:27 GMT+0530 (IST)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 35వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ బర్త్ డే విషెస్ లను వివిధ రకాల్లో చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నారు.  సౌత్ ఇండియాకు చెందిన చాలా మంది సెలబ్రెటీలు ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పారు.సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎన్టీఆర్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ ట్విట్టర్ లో పోస్టు పెడుతూ ‘హ్యాపీ బర్త్ డే తారక్. విష్ యు ఆల్ ది విక్టరీస్.. నీకు కలకాలం ప్రేమ తోడుండాలి’ అంటూ రాసుకొచ్చారు.

మహేష్ ఎన్టీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇటీవలే మహేష్ ‘భరత్ అనే నేను’ సినిమా ఆడియో ఫంక్షన్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. అప్పుడు మహేష్ ను ఎన్టీఆర్ ఆప్యాయంగా అన్న అంటూ పలకరించాడు.  ఆ ఫంక్షన్ తోనే వీరి మధ్య బంధం బలపడింది.  ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టినరోజున మహేష్ ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.