Begin typing your search above and press return to search.

భార్యపై మహేష్ కు ఎంత ప్రేమంటే..

By:  Tupaki Desk   |   22 Jan 2017 5:41 AM GMT
భార్యపై మహేష్ కు ఎంత ప్రేమంటే..
X
‘‘నా బలం.. నా జీవితానికి వెలుగు.. నా ప్రియమైన భార్యకు జన్మదిన శుభాకాంక్షలు’’ ఇదీ ఈ రోజు తన ట్విట్టర్ ఖాతాలో మహేష్ బాబు పెట్టిన మెసేజ్. తన భార్య లేటెస్ట్ ఫొటో ఒకటి షేర్ చేస్తూ ఈ ట్వీట్ పెట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు మహేష్. ఈ ట్వీట్ ను బట్టే మహేష్ కు తన భార్య అంటే ఎంత ఇష్టమో.. అతడి జీవితంపై నమ్రత ప్రభావం ఎలాంటిదో అర్థమైపోతుంది. ఒక బాలీవుడ్ హీరోయిన్.. మన తెలుగు హీరోను పెళ్లాడటం.. ఇక్కడి సాంప్రదాయాలకు.. పరిస్థితులకు అనుగుణంగా తన లైఫ్ స్టైల్ ను పూర్తిగా మార్చుకోవడం.. అలాగే తాను పెళ్లి చేసుకున్న కథానాయకుడి జీవితంలోనూ గొప్ప మార్పులు తీసుకురావడం ఆశ్చర్యకరమైన విషయం.

మహేష్ బాబు జీవితంలోకి నమ్రత శిరోద్కర్ వచ్చాక అతడిలో ఎన్ని మార్పులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వ్యక్తిగతంగా.. వృత్తిగతంగా మహేష్ జీవితంలో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చింది నమ్రత. తన సినిమాల రిలీజ్ సమయంలో పత్తా లేకుండా పోయే మహేష్ ను పెద్ద ఎత్తున ప్రమోషన్లలో పాల్గొనేలా చేసి.. పక్కా ప్లానింగ్ తో సినిమాలు ఎంచుకునేలా చేసి.. అతడి సినిమాల మార్కెట్ అనూహ్యంగా పెరగడానికి కారణం నమ్రతే. అలాగే పదుల సంఖ్యలో బ్రాండ్లు మహేష్ చేతికి వచ్చాయన్నా.. సినిమాల్లో కంటే అతను బ్రాండ్ల ద్వారా ఎక్కువగా సంపాదిస్తున్నాడన్నా అందుకు నమ్రతే కారణం. వ్యక్తిగతంగానూ మహేష్ జీవితంలో నమ్రత వచ్చాక చాలా మార్పులు కనిపించాయి. ఒకప్పుడు బిగుసుకుపోయినట్లు కనిపించిన మహేష్.. తర్వాత చాలా ఫ్రీ అయ్యాడు. నమ్రతతో పాటు పిల్లలు కూడా అతడిలో చాలా మార్పు తీసుకొచ్చారు. ఇటు వ్యక్తిగతంగా.. అటు వృత్తిపరంగా టాలీవుడ్లో అత్యంత సంతృప్తికర జీవితం గడుపుతున్న వారిలో మహేష్ ముందుంటాడు. ఇందుకు నమ్రత ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. ఈ సూపర్ స్టార్ వైఫ్ కు తుపాకి.కామ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/