Begin typing your search above and press return to search.

భరత్ టీజర్ కి వరల్డ్ సెకండ్ ప్లేస్

By:  Tupaki Desk   |   23 March 2018 6:08 PM GMT
భరత్ టీజర్ కి వరల్డ్ సెకండ్ ప్లేస్
X
మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ కాస్త లేట్ గా మొదలుపెట్టారనడంలో సందేహం లేదు. కానీ లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తా అంటూ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చెబితే.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నిజంగా చేసి చూపిస్తున్నాడు.

ఈ సినిమా టీజర్ ఇప్పటివరకూ ఎన్ని రికార్డులను సృష్టించిందో లెక్కపెట్టడం కూడా కష్టమైపోతోంది. మొదటి రోజు నుంచి రోజుకో రికార్డు అన్న తీరుగా దూసుకుపోతున్న భరత్ అనే నేను టీజర్.. ఇప్పుడు మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది. ప్రపంచంలో అత్యధిక లైక్స్ సంపాదించిన టీజర్లలో.. భరత్ అనే నేను కు సెకండ్ ప్లేస్ దక్కింది. ఇప్పటివరకూ మహేష్ లేటెస్ట్ మూవీ టీజర్ కు 6.40 లక్షల లైక్స్ వచ్చాయి. 14 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకుంది విజన్ ఆఫ్ భరత్. టాలీవుడ్ రికార్డులను ఎప్పుడో తుడిచిపెట్టేసిన భరత్ అనే నేను.. ఇప్పుడు ఏకంగా వరల్డ్ రికార్డుల్లో సెకండ్ ప్లేస్ కు చేరుకుంది.

అయితే.. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న చిత్రం కూడా ఇండియన్ మూవీ కావడం విశేషం. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ టీజర్ కు 38 మిలియన్ల వ్యూస్ రాగా.. 10 లక్షలకు పైగా లైక్స్ దక్కాయి. ఆ తర్వాతి స్థానంలో ఉన్న టీజర్ గా భరత్ అనే నేను నిలిచింది. ఈ చిత్రంపై ఇప్పుడున్న హైప్ ఇదే స్థాయిలో కంటిన్యూ కావాలే కానీ.. మెర్సల్ రికార్డును బద్దలు కొట్టేయడం మహేష్ కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.