Begin typing your search above and press return to search.

మహేష్ బాబుకి మండిపోయింది

By:  Tupaki Desk   |   24 Nov 2015 6:41 AM GMT
మహేష్ బాబుకి మండిపోయింది
X
మామూలుగా చాలా కూల్ గా ఉంటాడు మహేష్ బాబు. రూమర్లను కూడా పెద్దగా పట్టించుకోడు. అలాంటి వాడికి మండిపోయేలా చేసింది వెబ్-సోషల్ మీడియా. తన కొత్త సినిమా ‘బ్రహ్మోత్సవం’ స్క్రిప్టు విషయంలో మహేష్ అసంతృప్తిగా ఉన్నాడని.. షూటింగ్ ఆపించేసి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను మళ్లీ స్క్రిప్టు మీద పని చేయమని చెప్పాడని కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వాస్తవానికి ఇది అబద్ధమని.. బ్రహ్మోత్సవం షూటింగ్ ఏ ఇబ్బందీ లేకుండా సాగిపోతోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఐతే ఈ రోజుల్లో వెబ్ - సోషల్ మీడియా చాలా పవర్ ఫుల్ గా ఉన్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు సినిమా బిజినెస్ మీద ప్రతికూల ప్రభావం చూపుతాయన్న ఉద్దేశంతో మహేష్ దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడట.

ఈ వార్తలు ఎలా పుట్టాయో పీఆర్ టీంను అడిగి.. వెంటనే వీటిని క్లారిఫై చేయాలని ఆదేశించాడట. మామూలుగా షూటింగ్ గురించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వని పీఆర్ టీం.. బ్రహ్మోత్సవం నెక్స్ట్ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుందని.. ఆ తర్వాత యూనిట్ అంతా ఊటీకి వెళ్తుందని అత్యవసరంగా ప్రెస్ నోట్ ఇవ్వడానికి కారణం మహేష్ బాబు కోపమేనట. ఈ వార్తలు ఎలా వచ్చాయో తెలుసుకుని. సీరియస్ గా స్పందించాలని కూడా మహేష్ చెప్పాడట. ఐతే ఇండస్ట్రీలోనే కొందరు యాంటీస్ కావాలనే ఇలాంటి వార్తలు క్రియేట్ చేసి మీడియాకు ఉప్పందిస్తుంటారన్న సంగతి మహేష్ కు తెలియందేమీ కాదు.