Begin typing your search above and press return to search.

మహేష్-త్రివిక్రమ్ కథ లేనట్లే

By:  Tupaki Desk   |   24 April 2018 7:36 AM GMT
మహేష్-త్రివిక్రమ్ కథ లేనట్లే
X
మహేష్ ఒక డైరెక్టర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు అంటే ఆ సినిమా ఎలాగైనా పట్టాలెక్కేస్తుంది అని ఇండస్ట్రీలో ఒక టాక్ స్ట్రాంగ్ గా ఉంది. అయితే మహేష్ ఫిక్స్ చేసే ముందు దర్శకుల బ్యాక్ గ్రౌండ్ చూస్తాడు అనేది అందరికి తెలిసిందే. మంచి హిట్ కొట్టిన దర్శకుడు అయితేనే సినిమా చేస్తాడు. ఇకపోతే గత కొంత కాలంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఒక సినిమా చేస్తాడని వార్తలు చాలానే వచ్చాయి. దాదాపు కథ కూడా ఫిక్స్ అయ్యిందని టాక్ వచ్చింది.

అయితే ప్రస్తుతం ఆ కాంబినేషన్ లేనట్లే అని తెలుస్తోంది. ముందుగా మహేష్ వరుసగా ముగ్గురు దర్శకులను లైన్ లో పెట్టాడు. తన నెక్స్ట్ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతోన్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గా సుకుమార్ - మైత్రి మూవీ మేకర్స్ కాంబోకి కూడా సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఎప్పటి నుంచో మహేష్ తో ప్రయాణం చేస్తోన్న అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ తో కూడా ఒక ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యింది. ఆసలైతే వంశీ పైడిపల్లి సినిమా తరువాత త్రివిక్రమ్ కథ పట్టాలెక్కాలి.

మైత్రి మూవీ మేకర్స్ కూడా త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్ ని ఎప్పుడో ఫిక్స్ చేసుకుంది. కానీ సడన్ గా ఇప్పుడు సుక్కుతో ప్లాన్ చేసుకున్నారు. త్రివిక్రమ్ చాలా కాలంగా హారికా హాసిని ప్రొడక్షన్ లోనే సినిమాలు చేస్తున్నాడు. వారు కూడా మహేష్ - త్రివిక్రమ్ ని సెట్ చేద్దామని అనుకోని అప్పట్లో మహేష్ కు అడ్వాన్స్ ఇచ్చారట. కానీ ఏమైందో గాని మళ్లీ మహేష్ నుంచి తిరిగి తీసేసుకున్నారని టాక్. మొత్తంగా మహేష్ ఇప్పుడైతే ఖాళీగా లేడు. ఒకవేళ ఉన్నా కూడా త్రివిక్రమ్ లో ఫామ్ లోకి వస్తే గాని మహేష్ ఒకే చేయడు. అది సంగతి.