Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్ సంగతేంటి మహేష్?

By:  Tupaki Desk   |   22 Jan 2017 6:56 AM GMT
ఫస్ట్ లుక్ సంగతేంటి మహేష్?
X
తెలుగు-తమిళ భాషల్లో మురుగదాస్ డైరెక్షన్ లోమహేష్ బాబు బై లింగ్యువల్ చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ బేస్డ్ మూవీ కావడంతో.. ఈ సినిమా షూటింగ్ బాగా స్లోగా సాగుతోందనే టాక్ వినిపిస్తోంది. జనవరి చివరికల్లా షూటింగ్ పూర్తి చేయాలని భావించారు కానీ.. ఇప్పడది సాధ్యం కాదని తేలిపోయింది. అయితే.. కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

సంభవామి అనే టైటిల్ ను ఈ చిత్రానికి పరిశీలిస్తుండగా.. న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ ఇస్తారనే టాక్ వినిపించింది. అది వెళ్లిపోయింది.. పొంగల్ పూర్తయిపోయింది. ప్రస్తుతం రిపబ్లిక్ డేనాడు మహేష్-మురుగ మూవీకి ఫస్ట్ లుక్ ఇస్తారనే టాక్ ఉంది కానీ.. మూవీ యూనిట్ నుంచి మాత్రం.. ఇందుకు సంబంధించిన సిగ్నల్స్ ఏమీ లేవు. జనవరి 26న మహేష్ సినిమాకి ఫస్ట్ లుక్ రావడం అనుమానమే అంటున్నారు. ఇందుకు కారణం.. షూటింగ్ లేట్ కావడమే అంటున్నారు.

మరోవైపు ఈ సినిమా ఆలస్యం అవుతుండడంతో.. కొరటాల శివ కూడా మహేష్ బాబుతో తన చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా స్లో చేసేశాడట. మురగ మూవీ కంప్లీట్ అయితే కానీ.. కొత్త సినిమా ప్రారంభించే అవకాశం లేకపోవడంతోనే.. కొరటాల కూడా స్లో అయ్యాడని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/