Begin typing your search above and press return to search.

లాస్ వేగాస్ రేస్ ట్రాక్ లో కొడుకుతో..

By:  Tupaki Desk   |   12 Dec 2017 5:08 AM GMT
లాస్ వేగాస్ రేస్ ట్రాక్ లో కొడుకుతో..
X
మహేష్ బాబు పక్కా ప్రొఫెషనల్ అనే సంగతి తెలిసిందే. తన ప్రొఫెషనల్ యాక్టివిటీస్ కి బోలెడంత ఇంపార్టెన్స్ ఇచ్చే మహేష్.. ఫ్యామిలీ రిలేషన్స్ కి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే పలు మార్లు మహేష్ తన కుటుంబంతో టూర్ కి వెళ్లినా అక్కడ కూడా ఒకరిద్దరు దర్శకులతో డిస్కషన్స్ చేస్తూ కనిపిస్తుంటాడు.

ఇక తన షూటింగ్ స్పాట్స్ కు పిల్లలను తీసుకురావడం కూడా కొత్తేమీ కాదు. బ్రహ్మోత్సవం మూవీ షూటింగ్ ఎక్కువగా హైద్రాబాద్ లో జరగడంతో.. కూతురు సితార ఎన్నిసార్లు ఆ స్పాట్ కు వచ్చిందో చెప్పలేం. అయితే సూపర్ స్టార్ కుమారుడు గౌతమ్ కృష్ణ మాత్రం కాస్త అరుదుగానే ఇలా కనిపిస్తుంటాడు. అప్పట్లో 1నేనొక్కడినే షూటింగ్ కు మినహాయిస్తే.. గౌతమ్ అంతగా దర్శనం ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం మహేష్ లాస్ వెగాస్ లో ఉన్నాడు. సాఫ్ట్ డ్రింక్ థమ్సప్ యాడ్ షూటింగ్ నాస్కార్ రేస్ ట్రాక్ లో జరుగుతుండటంతో మహా బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. బోలెడన్ని స్టంట్స్ కూడా చేసేస్తున్నాడు.

లాంగ్ షెడ్యూల్ అయినా సరే.. గౌతమ్ ను అక్కడకు తీసుకెళ్లడం చెప్పుకోవాల్సిన విషయం. అక్కడ మరో కుర్రాడితో కలిసి గౌతమ్ ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు. గతంతో పోల్చితే సన్నబడిన గౌతమ్.. భలే చూడముచ్చటగా ఉన్నాడు. యాడ్ షూటింగ్ కొన్ని రోజుల పాటు మాత్రమే జరిగేది అయినా.. ఇలా కొడుకును కూడా మహేష్ వెంట తీసుకెళ్లడం విశేషం. ఇకపోతే అక్కడ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కూడా మహేష్‌ తో బాగా బాండింగ్ అయ్యాడు.