Begin typing your search above and press return to search.

మహేష్ బన్నీల వార్ ఫిక్స్

By:  Tupaki Desk   |   27 Jun 2019 6:11 AM GMT
మహేష్ బన్నీల వార్ ఫిక్స్
X
గత ఏడాది అల్లు అర్జున్ నా పేరు సూర్య మహేష్ బాబు భరత్ అనే నేను ఒకేటైం లో విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇద్దరు నిర్మాతలు కలిసి మాట్లాడుకుని ఒక అండర్ స్టాండింగ్ మీద బన్నీ సినిమాను ఓ రెండు వారాలు వాయిదా వేసేలా నిర్ణయం తీసుకుని థియేటర్ల ఇబ్బంది రాకుండా అభిమానుల మధ్య ఫాన్ వార్ జరగకుండా చూసుకున్నారు. అది సమ్మర్ కాబట్టి ఇదేమి సమస్యగా మారలేదు. కానీ అప్పుడైతే మిస్ అయ్యింది కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం మహేష్ బన్నీ క్లాష్ తప్పేలా లేదు.

సరిలేరు నీకెవ్వరు ముందుగా పండగ బెర్తు రిజర్వ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంకా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళక ముందే ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబో మూవీ కూడా సంక్రాంతి రేస్ లోనే నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్ .నిజానికి దీన్ని దసరా పండక్కు తెద్దాం అనుకున్నారు. కానీ అప్పటికంతా ఫస్ట్ కాపీ సిద్ధం చేయడం కష్టం. ఒకవేళ డెడ్ లైన్ పెట్టుకుని చేద్దాం అనుకున్నా మెగాస్టార్ సైరా అక్టోబర్ 2 లాక్ చేసుకుంది.

సో ఇంక వేరే ఆప్షన్ లేదు. పోనీ డిసెంబర్ లో రిలీజ్ చేద్దామంటే స్టార్ హీరోలకు రెవిన్యూ పరంగా ఆ నెల అంత సేఫ్ గేమ్ కాదు. సో ఇంత చర్చ ఎందుకని సంక్రాంతికే డిసైడ్ అయ్యారట. ఎలాగూ మూడు నాలుగు స్టార్ హీరోల సినిమాలు ఆ పండగ అకామడేట్ చేస్తుంది కాబట్టి వసూళ్ల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా టైం ఉంది కాబట్టి అధికారిక ప్రకటనకు టైం పట్టవచ్చు