Begin typing your search above and press return to search.

AMB సినిమాస్: సూపర్ స్టార్ బ్రాండ్

By:  Tupaki Desk   |   18 Sep 2018 3:41 PM GMT
AMB సినిమాస్: సూపర్ స్టార్ బ్రాండ్
X
సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. లీడింగ్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అయిన ఆసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ తో కలిసి మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టిప్లెక్స్ చైన్ నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి గానీ ఇంతవరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు.

కానీ తాజా సమాచారం మేరకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏరియాలో సునీల్-మహేష్ బాబు కు సంబంధించిన ఒక భారీ మల్టిప్లెక్స్ ఆల్రెడీ నిర్మాణంలో ఉంది. గచ్చిబౌలి నుండి కొత్తగూడ క్రాస్ రోడ్ కు వచ్చేదారిలో మెయిన్ రోడ్ మీద నిర్మాణం జరుపుకుంటున్న ఒక భారీ మాల్ లో ఈ మల్టిప్లెక్స్ ఉంది. ఈ మల్టిప్లెక్స్ మాడరన్ ఫెసిలిటీస్ తో రెడీ అవుతోందట. ఈ మల్టిప్లెక్స్ గ్రూప్ పేరు 'AMB సినిమాస్'. ఈ మల్టిప్లెక్స్ వచ్చే ఏడాది ఓపెన్ అవుతుందని సమాచారం. రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ గ్రూప్ ను విస్తరించే ప్లాన్స్ లో ఉన్నారట.

ఇక ఈ మల్టిప్లెక్స్ కు సంబంధించిన స్కెచ్ లు ఈరోజే బయటకు వచ్చాయి. సాధారణంగా సూపర్ స్టార్ సినిమాకు ఫస్ట్ లుక్ లాంటివి చూస్తుంటాం కదా. ఇది సూపర్ స్టార్ బిజినెస్ కు ఫస్ట్ లుక్ అనుకోండి. అన్నట్టు ఈ బిజినెస్ లో మహేష్ బాబు భారీగా ఇన్వెస్ట్ చేశాడని టాక్.