Begin typing your search above and press return to search.

అప్పుడే 17 నిండిపోయాయా మహేష్!

By:  Tupaki Desk   |   30 July 2016 2:46 PM GMT
అప్పుడే 17 నిండిపోయాయా మహేష్!
X
ప్రిన్స్ మహేష్ బాబు.. టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరు. సూపర్ స్టార్ హోదాలో హీరోగా అలరిస్తున్న మహేష్.. ఆ బిరుదు చిన్నబుచ్చుకునేలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. అభిమానులంతా ముద్దుగా ప్రిన్స్ అని పిలుచుకునే ఈ యువరాజు జీవితంలో జూలై 30కి ప్రత్యేక స్థానం ఉంది. అదేమిటంటే... మహేష్ బాబు 1999 జూలై 30వ తేదీనే "రాజకుమారుడు" గా అభిమానుల ముందుకు వచ్చాడు. అంటే.. సరిగ్గా 17ఏళ్ల క్రితం దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తీసిన "రాజకుమారుడు" సినిమా రిలీజైంది. ఇలా మహేష్ అభిమానులకు ఎంతో ఇష్టమైన, మరిచిపోలేని రోజుగా ఈ తేదీకీ ఒక ప్రత్యేకత ఉంది!

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు... తనదైన నటనతో టాలీవుడ్ ని ఏలుతున్నాడనే చెప్పాలి. హిట్ లు - ప్లాపులు అనే తేడా పట్టిచ్చుకోకుండా తనకంటూ ఒక కొత్త ట్రెండ్ ని సృష్టించుకుని ముందుకు వెళ్తున్నాడు మహేష్. హీరోగా కేవలం తెరమీదకే పరిమితం కాకుండా వ్యక్తిగా కూడా తన వ్యక్తిత్వానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటాడు. సినిమా హిట్టూ విషయంలో ముందుకు వచ్చి, ఫట్టూ విషయంలో తప్పించుకు తిరిగే చాలామందిలా కాకుండా.. సినిమా ఫ్లాఫ్స్ కి తానుకూడా ప్రధానమైన బాధ్యుడ్ని అని ఒప్పుకునే హీరో ఈ సూపర్ స్టార్.

హీరోగా ప్రేక్షకుల ముందుకు తమ అభిమాన హీరోవచ్చి 17ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకుంటూ... నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్.. మురుగదాస్ డైరెక్షన్ లో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. బ్రహ్మోత్సవం కాస్త నిరాశపరచడంతో ఈ ప్రాజెక్టుపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు!