Begin typing your search above and press return to search.

సీఎం భరత్ కబుర్లు భలే ఉన్నాయిగా

By:  Tupaki Desk   |   21 March 2018 4:53 PM GMT
సీఎం భరత్ కబుర్లు భలే ఉన్నాయిగా
X
మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇంకా కొన్ని సన్నివేశాలు.. రెండు పాటల చిత్రీకరణతో షూట్ పూర్తయిపోనుంది. అయితే.. మూవీ రిలీజ్ కి ఇంకా 4 వారాల సమయం మాత్రమే ఉండడంతో.. ప్రచారంలో జోరు పెంచాలని రకరకాల ఐడియాలు వేస్తున్నారు మేకర్స్. ఇందుకోసం చిత్రవిచిత్రమైన కబుర్లు చెబుతున్నారు కూడా.

భరత్ అనే నేను టీజర్ బంపర్ రికార్డులు సాధించిన విషయం ఒప్పుకోవాల్సిందే. ఆ తర్వాత మహేష్ బాబును కలిసేందుకు బోలెడంత మంది అభిమానులు వచ్చేయడం కూడా అంగీకరించే విషయమే. అయితే.. ఇలా తనను కలవడానికి వచ్చిన ప్రతీ ఒక్కరితోనూ కాసేపు ముచ్చట్లు పెడుతున్నాడట సూపర్ స్టార్. అంతే కాదు.. అభిమానులు అందరితోనూ ఫోటోలు కూడా దిగి పంపిస్తున్నాడట. ఇలా గత మూడు రోజుల వ్యవధిలో ఏకంగా 1500 మందితో ఫోటోలు దిగాడట మహేష్ బాబు. ఇదో కొత్త రికార్డ్.. భరత్ న్యూ రికార్డ్ అంటూ ప్రచారం చేసుకుంటున్న వైనం అందరికీ నవ్వు తెప్పించేస్తోంది.

హీరో క్యారెక్టర్ ఏంటో ఇప్పటికే చెప్పేయగా.. సినిమా స్టోరీ చెప్పకుండా ప్రచారం చేయాలన్నది భరత్ అనే నేను మేకర్స్ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే కొత్తగా మూవీ గురించి ఎలాంటి అఫ్ డేట్స్ ఇవ్వకుండా.. ఏదో ఒక లీకులను అందిస్తూ ప్రచారం చేయాలని తాపత్రయపడుతున్నారు. ఫ్యాన్స్ తో ఫోటోలు దిగడమూ ప్రచారానికే వాడేస్తూ.. అలాగే 1500 మందితో ఫోటోల పేరుతో రికార్డ్ అంటూ హంగామా చేస్తున్నారు. భరత్ అనే నేను రిలీజ్ లోపు ఇంకెన్ని విచిత్రమైన ప్రచారాలను చూడాలో!