MB26 ఆల్ సీక్రెట్స్ లీక్

Mon May 27 2019 11:35:07 GMT+0530 (IST)

సూపర్ స్టార్ మహేష్ నటించిన `మహర్షి` ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే. రిలీజ్ ప్రమోషన్స్ అనంతరం మహేష్ విదేశాలకు ఫ్యామిలీ ట్రిప్ వెళ్లారు. నమ్రత-సితార-గౌతమ్ సహా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి మహేష్ యూరఫ్ ట్రిప్ లో ఉన్నారు. ఈ ట్రిప్ నుంచి రకరకాల ఫోటోల్ని నమ్రత మహేష్ బృందం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.



మరోవైపు మహేష్ నటించే 26వ సినిమాకి అనీల్ రావిపూడి బృందం యుద్ధ సన్నాహకాల్లో ఉంది. మహేష్ విదేశీ ట్రిప్ ముగించుకుని రాగానే ఈ సినిమా ప్రారంభోత్సవం ఉంటుందని తెలుస్తోంది. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఘట్టమనేని అభిమానుల సమక్షంలో ఘనంగా ఈ ప్రారంభోత్సవం ఉంటుందని ప్రచారమవుతోంది. అయితే అందుకు సంబంధించి ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అలాగే దర్శకుడు అనీల్ రావిపూడి సైతం సామాజిక మాధ్యమాల్లో ఈ లాంచింగ్ గురించి రివీల్ చేయలేదు. అయితే ఆయన ఓ హింట్ మాత్రం ఇచ్చారు.

ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తయింది. సూపర్ స్టార్ జాయిన్ అయితే చాలు.. మిగతా పని మేం పూర్తి చేస్తాం అంటూ దర్శకుడు అనీల్ రావిపూడి సామాజిక మాధ్యమాల్లో అదిరిపోయే హింట్ ఇచ్చారు. ఆరు డిఫరెంట్ ఈమోజీలతో ఆరు రకాల ఎక్స్ ప్రెషన్స్ ని ఇచ్చారాయన. అసలు వీటిలో రహస్యం ఏం ఉంది? అన్నది పరిశీలిస్తే ఇదీ సంగతి....

స్క్రిప్టు అద్భుతంగా వచ్చింది
సూపర్ స్టార్ రేంజుకు తగ్గట్టు ఉంటుంది
మరోసారి పెన్ పవరేంటో చూపిస్తున్నాం.. కథ- డైలాగ్స్ వగైరా
స్క్రిప్టు పరంగా పూర్తి సంతృప్తిగా ఉన్నాం
సెట్స్ కెళ్లడానికి రెడీగా ఉన్నాం
మహేష్ ఫ్యాన్స్ కి ముందుంది ముసళ్ల పండగ
ఇదీ ఈ ఈమోజీల సారాంశం... ఏమంటారు అనీల్ రావిపూడి గారూ?