టీజర్ టాక్: ట్వంటీస్ లోకెళ్ళిపోయిన మహేష్!

Thu Aug 09 2018 09:34:38 GMT+0530 (IST)

ఎంటో.. చాలామంది పొట్టిగా ఉన్నామని పొట్టఉందని బాధ పడుతుంటారు. కానీ మన సూపర్ స్టార్  మహేష్ బాబుకు లాంటి బాధలేం లేవు. అసలే సూపర్ స్టార్ కృష్ణ కొడుకు.. అందగాడు. పైగా ఇప్పుడు తను కూడా సూపర్ స్టార్. పాతిక సినిమాలు చేసి నలభైల్లో ఉన్నా పాతికేళ్ళలోపు ఉన్న కుర్రాడిలా అమ్మాయిల మనసుల్ని మెలిపెట్టేలా బిహేవ్ చేస్తున్నాడు.  అసలే మహేష్ పుట్టిన రోజు ఆయనపై ఇన్ని అభాండాలా అని కోపం తెచ్చుకోవద్దు!ఈరోజు మహేష్ పుట్టిన రోజు సందర్భంగా తన 25 వ చిత్రం 'మహర్షి' ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.  తాజాగా టీజర్ ను కూడా మహేష్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా షేర్ చేశాడు.  "మీ ప్రేమకు దీవెనలకు చాలా సంతోషంగా ఉంది.  రిషి గా నా ప్రయణాన్ని ఈ రోజు మొదలు పెడుతున్నాను. #మీట్ రిషి" అంటూ ట్వీట్ చేశాడు.  42 సెకండ్స్ టీజర్ లో మహేష్ అలా నడుస్తాడు. అంతే.

అంతే అనుకుంటే అయన సూపర్ స్టార్ ఎందుకయ్యాడు? మనం ఎందుకు మాట్లాడుకుంటాం?  ఓ బ్యూటిఫుల్ కాలేజ్.. అక్కడ ఓ ట్వంటీస్ లో ఉన్న ఓ కుర్రాడు(మనకి తెలుసు గానీ మహేష్ ఎవరో తెలీని వాళ్ళకు ఈ టీజర్ చూపించి అడగండి వయసెంతో.. అప్పుడు చెప్తారు.) అలా స్టైల్ గా నడుస్తూ ఒక చేత్తో హెయిర్ ని అలా దువ్వుకుంటూ మరో చేత్తో ల్యాప్ టాప్ పట్టుకుంటే ఎదురుగా వచ్చే అమ్మాయిలు ఏం కావాలి? ఓ అమ్మాయి అలా వెనక్కి తిరిగి చూస్తుంది మన మహేష్ కుడా వెనక్కి అలా తిరిగి చూస్తాడు.  బ్యాక్ గ్రౌండ్ లో తన మ్యుజిక్ తో ఈ సీన్ ఆస్కార్ లెవెల్ కి ఎలివేట్ చేసేలా దేవీ మ్యూజిక్.. పిక్చరైజేషన్లో వంశీ మ్యాజిక్.  టోటల్ గా ఆడియన్స్ క్లీన్ బౌల్డ్!