Begin typing your search above and press return to search.

మహర్షి హాఫ్ సెంచరీ వేడుకలు

By:  Tupaki Desk   |   25 Jun 2019 5:42 AM GMT
మహర్షి హాఫ్ సెంచరీ వేడుకలు
X
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి ఇంకో మూడు రోజుల్లో యాభై రోజులు పూర్తి చేసుకోబోతోంది. సమ్మర్ సీజన్ ని ఇంత పర్ఫెక్ట్ గా వాడుకున్న స్టార్ హీరో సినిమా గత కొన్నేళ్లలో ఇదే అని చెప్పొచ్చు. మొదట్లో కొంత డివైడ్ టాక్ వినిపించినా మహేష్ గత ఇండస్ట్రీ హిట్స్ స్థాయిలో ఇందులో కంటెంట్ లేదనే కామెంట్స్ వచ్చినా అవేవి రన్ ని ఆపలేకపోయాయి.

మే 9 నుంచి మొదలుకుని ఏ ఒక్క అపోజిషన్ బలంగా లేకపోవడం కూడా మహర్షికి చాలా పెద్ద ప్లస్ అయ్యింది. అందుకే చాలా కేంద్రాల్లో రన్ ని అలాగే కొనసాగించారు. యూనిట్ ప్రకటించిన దాని ప్రకారం మహర్షి 200 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోబోతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే పెద్ద రికార్డు అని చెప్పుకోవచ్చు. సెంటర్స్ లిస్ట్ ప్రకటించాక ఫైనల్ క్లారిటీ వస్తుంది

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహర్షి టీమ్ హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో గ్రాండ్ సెలెబ్రేషన్స్ చేయబోతోంది. దీనికి మహేష్ తో సహా టీమ్ మొత్తం హాజరు కానుండగా ప్రత్యేక అతిధులు కూడా ఉంటారని తెలిసింది. వాళ్ళు ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ ఫిఫ్టీ డేస్ అయ్యాక ఇక రన్ కొనసాగించడం కష్టమే. క్రేజీ సినిమాలు ఒక్కొక్కటిగా క్యూ కడుతున్న తరుణంలో ఫైనల్ రన్ కు చేరుకున్నాడు మహర్షి.

అందిన సమాచారం మేరకు సుమారు 103 కోట్ల షేర్ తో ఆల్ టైం హిట్స్ లో నాలుగో ర్యాంక్ తీసుకున్న మహర్షి కొన్ని సెంటర్లలో హండ్రెడ్ డేస్ ఆడుతుందని అభిమానులు అంటున్నారు. మొత్తానికి గత ఏడాది భరత్ అనే నేను ఇప్పుడీ మహర్షి వరస హిట్లతో మహేష్ ఫుల్ స్వింగ్ లోకివచ్చేశాడు. అందుకే ఇంకా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకాని సరిలేరు నీకెవ్వరు మీద అప్పుడే విపరీతమైన క్రేజ్ వచ్చేసింది