మహానుభావులందరికి ప్రభాస్ సెల్ఫీ

Mon Sep 25 2017 11:37:06 GMT+0530 (IST)

బాహుబలి హిట్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ఇమేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇప్పుడు సాహో తో మరో భారీ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి అటువంటి స్టార్ ఎదురైతే ఎవ్వరైనా సరే ఒక సెల్ఫీ దిగకుండా ఉండలేరు. అదే పని మహానుబావుడి చిత్ర యూనిట్ చేసింది.



ప్రభాస్ మిర్చి సినిమాతో యువి క్రియేషన్స్ ఎంతగా పాపులర్ అయ్యిందో తెలుసు. అంతే కాకుండా చిత్ర నిర్మాతలు ప్రభాస్ స్నేహితులే కావడంతో వారు తెరకెక్కించే ప్రతి సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో ప్రభాస్ ప్రమేయం ఉండేలా చేసుకుంటున్నారు. అదే తరహాలో రీసెంట్ గా వారు నిర్మించిన మహానుభావుడు సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. దీంతో చిత్ర యూనిట్ లోని సభ్యులు ప్రభాస్ తో సెల్ఫీలు దిగారు. చిత్ర దర్శకుడు మారుతి దిగిన సెల్ఫీలో ప్రభాస్ తో పాటు హీరో శర్వానంద్ అండ్ సంగీత దర్శకుడు థమన్ కూడా ఉన్నారు.

ఇక వేడుకను నడిపించిన యాంకర్ శ్రీముఖి కూడా ప్రభాస్ తో సింపుల్ గా సెల్ఫీ దిగింది. అదే తరహాలో సీనియర్ ఆర్టిస్ట్ రజిత తో పాటు మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ప్రభాస్  సెల్ఫీ దిగాడు. ప్రభాస్ ప్రతి సెల్ఫీలో తన స్మైల్ తో అదరగొట్టాడు. అడిగిన వారందరికీ సెల్ఫీ ఇచ్చాడు. ఇక మహానుభావుడు సినిమా ఈ నెల 29న రిలీజ్ కాబోతోంది.