Begin typing your search above and press return to search.

అరే.. సావిత్రి కోసం పార్టీ చేసుకున్నారే

By:  Tupaki Desk   |   23 March 2018 4:48 AM GMT
అరే.. సావిత్రి కోసం పార్టీ చేసుకున్నారే
X
ఓ సినిమా షూటింగ్ పూర్తయిపోతే.. ఈ మూవీ యూనిట్ సంబరాలు చేసుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఓ ప్రాజెక్టును సక్సెస్ ఫుల్ గా.. అనుకున్న విధంగా పూర్తి చేశామనే విషయాన్ని సంతోషంగా పంచుకోవడం అంతే. రీసెంట్ గా మహానటి మూవీ టీం కూడా ఇలాగే చేశారు.

అయితే.. ఏ ప్రాంతంలో అయితే మేటి నటి సావిత్రి ఫోటోకు దండ వేసి.. వెనుకాల పెద్ద ఫ్లెక్సీ ఉంచి.. ఆమెకు అంజలి ఘటించారో.. అక్కడే పార్టీలు కూడా చేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. నిజమైన మహానటికి వీరు నివాళులు అర్పించిన తీరుపై అందరి నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా షూట్ కు పర్ఫెక్ట్ ముగింపు ఇదే అంటూ తెగ పొగిడేశారు. అంతలోనే విమర్శలు తావిచ్చేలా ప్రవర్తించమడే విచిత్రం. మహానటిగా నటిస్తున్న కీర్తి సురేష్.. దుల్కర్ సల్మాన్.. దర్శకుడు నాగ్ అశ్విన్.. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్.. ఇలా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని డ్యాన్సులతో అలరించారు. సావిత్రి ఫోటో ఫ్రేమ్ ముందు ఏడ్చిన వాళ్లు అంతా.. సావిత్రి కోసం భలే పార్టీ చేసుకున్నారు.

మహానటి మూవీ కోసం ఇంకా గ్రాఫిక్ వర్క్ కొంత పెండింగ్ ఉంది. దీంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసేందుకు పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. మే 9వ తేదీన మహానటి విడుదల అవుతుందంటూ ఇప్పటికే క్లారిటీ వచ్చేసిన సంగతి తెలుసు కదా.