Begin typing your search above and press return to search.

ఆ పాత సావిత్రి పాట మేకింగ్ వీడియో

By:  Tupaki Desk   |   30 May 2017 5:03 AM GMT
ఆ పాత సావిత్రి పాట మేకింగ్ వీడియో
X
సావిత్రి జీవిత చరిత్రపై మహానటి అనే చిత్రం షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముహూర్తం షాట్ తో పాటు మూవీ షూటింగ్ కూడా ప్రారంభించేశారు. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తుండగా.. ఈ సినిమాలో సమంత కీలకమైన రోల్ చేయనుంది.

ప్రస్తుతం రామకృష్ణా స్టూడియోస్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. స్టూడియోలో వేసిన సెట్లో.. ఓ పాత మధురగీతాన్ని పిక్చరైజ్ చేస్తున్నారు. తొలి షెడ్యూల్ లో ఈ పాటను మాత్రమే పిక్చరైజ్ చేస్తారని తెలుస్తోంది. మాయాబజార్ సినిమాలోని ఓ పాటను అప్పట్లో సావిత్రిపై ఎలా చిత్రీకరించారో.. ఆ తరహా సెట్ లో ఇప్పుడు దాని మేకింగ్ వీడియో స్టయిల్లో పాటను తీస్తున్నారట. ఐదు రోజుల వ్యవధిలోనే ఈ పాట షూట్ పూర్తి కానుందట. అక్కడితే ఈ షెడ్యూల్ కు ప్యాకప్ చెప్పేయనున్నారు. ఇక సావిత్రిగా కీర్తి సురేష్ బాగా నప్పిందని యూనిట్ వర్గాలు అంటున్నాయి.

తొలి షెడ్యూల్ ను 5 రోజుల్లోనే ముగించినా.. మరుసటి షెడ్యూల్ మాత్రం సుదీర్ఘంగానే ఉంటుందిట. జూన్ 15న ప్రారంభమయ్యే రెండో షెడ్యూల్ 25 రోజుల పాటు ఉంటుందని అంటున్నారు. ఈ షెడ్యూల్ లో కీర్తి సురేష్ తో పాటు దుల్కర్ సల్మాన్ సహా పలువురు కీలక పాత్రధారులు పాల్గొననున్నారు. రాజేంద్ర ప్రసాద్.. విజయ్ దేవరకొండలను కూడా ఇప్పటికే మూవీలో భాగం చేయగా.. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న మహానటికి.. నాగ్ అశ్విన్ దర్శకుడు. వైజయంతీ మూవీస్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/