Begin typing your search above and press return to search.

మహానటి వసూళ్లు డల్లయ్యాయ్

By:  Tupaki Desk   |   21 May 2018 3:36 PM GMT
మహానటి వసూళ్లు డల్లయ్యాయ్
X
మహానటి మూవీకి వచ్చిన పాజిటివ్ టాక్ మామూలుది కాదు. ఎవరి నోట విన్నా అద్భుతం అనే కాదు.. ఏ రివ్యూ చదివినా ఔరా అనిపించేలా ఉన్నాయి. దీంతో స్థానిక మార్కెట్లతో పాటు.. ఓవర్సీస్ లో కూడా మహానటికి అడ్డు లేకుండా పోయింది. భారీ వసూళ్లను కొల్లగొట్టింది.

తొలి వారం ముగిసేసరికి 2 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన మహానటి.. సెకండ్ వీకెండ్ లో కూడా ఓవర్సీస్ లో మంచి ప్రదర్శన కనబరుస్తుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ ఆశ్చర్యకరంగా.. రెండో వారాంతంలో 3 లక్షల డాలర్లకు కాసింత ఎక్కువ మాత్రమే ఈ సినిమా రాబట్టగలిగింది. దీంతో కలిపి ఓవర్సీస్ లో వసూలు చేసిన మొత్తం 2.3 మిలియన్ డాలర్లకు చేరుకుంది. అక్కడి రైట్స్ వాల్యూతో పోల్చితే ఇది చాలా ఎక్కువ కానీ.. తొలి వారం వసూళ్లతో పోల్చితే మాత్రం.. ఇది చాలా చాలా తక్కువ. ఫిదా.. అఆ లాంటి సినిమాల కంటే కూడా మహానటికి సెకండ్ వీక్ కలెక్షన్స్ డల్లుగా ఉన్నాయి.

సెకండ్ వీకెండ్ టాప్ వసూళ్ల జాబితాలో 4లక్షల డాలర్లకు పైగా వసూలు చేసి రంగస్థలంలో తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత భరత్ అనే నేను.. శ్రీమంతుడు.. ఫిదా.. అఆ నిలిచాయి. విచిత్రంగా మహానటి మూవీ టాప్5 లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. అయితే.. మహానటి కథ ఇక్కడితో అయిపోయినట్లు కాదని.. ఇది లాంగ్ రన్ ఉన్న మూవీ అని ట్రేడ్ జనాలు చెబుతుండడం కొంత ఊరట కలిగించే విషయమే అయినా.. అంచనా వేసినట్లుగా 3 మిలియన్ల మార్కును అందుకోవడం అసాధ్యం కావచ్చు.