Begin typing your search above and press return to search.

టాప్ 10 ఫిలిమ్స్ లిస్టులో మహానటి.. రంగస్థలం

By:  Tupaki Desk   |   13 Dec 2018 7:37 AM GMT
టాప్ 10 ఫిలిమ్స్ లిస్టులో మహానటి.. రంగస్థలం
X
ఇంటర్నెట్ లో యాక్టివ్ ఆ ఉండే సినీ ప్రియులకు పరిచయం అక్కరలేని పేరు IMDb(ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్). తాజాగా ఐఎండీబీ వారు 2018 సంవత్సరానికి గానూ టాప్-10 ఇండియన్ సినిమాల లిస్టు విడుదల చేశారు. ఈ లిస్టులో రెండు తెలుగు సినిమాలు చోటు దక్కించుకోవడం విశేషం.

అందులో ఒకటి లెజెండరీ తెలుగు యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ 'మహానటి' కాగా మరొకటి రామ్ చరణ్ సినిమా 'రంగస్థలం'. ఈ లిస్టులో 'మహానటి' నాలుగవ స్థానం సాధించగా.. 'రంగస్థలం' ఏడవ స్థానంలో నిలిచింది. సహజంగా ఈ లిస్టులో ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలు ఉంటాయి. అలాంటి లిస్టులో రెండు తెలుగు సినిమాలు చోటు సంపాదించడం గొప్పవిషయమే. బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించడమే కాకుండా ఈ సినిమాలు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న విషయం తెలిసిందే. వీటితో పాటుగా రెండు తమిళ చిత్రాలు 'రాట్చసన్'.. '96' కూడా టాప్ ఈ లిస్టులో చోటు సంపాదించాయి.

టాప్ 10 లిస్టు ఇలా ఉంది:

1. అంధా ధున్ (హిందీ)
2. రాట్చసన్ (తమిళం)
3. 96 (తమిళం)
4. మహానటి
5. బధాయి హో (హిందీ)
6. ప్యాడ్ మ్యాన్ (హిందీ)
7. రంగస్థలం
8. స్త్రీ (హిందీ)
9. రాజి (హిందీ)
10. సంజు (హిందీ)