ధనుష్ కి కోర్టు నుంచి రిలీఫ్!!

Fri Apr 21 2017 19:26:48 GMT+0530 (IST)

కోలీవుడ్ హీరో ధనుష్ కు కోర్ట్ నుంచి రిలీఫ్ లభించింది. కొన్ని నెలలుగా ఇబ్బంది పెడుతున్న కేసు నుంచి.. ధనుష్ బయటపడ్డాడు. ధనుష్ తమ కొడుకేనని.. వృద్ధాప్యంలో తమను పట్టించుకోవడం లేదని కదిరేశన్ దంపతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

అయితే.. ఈ కేసులో మొదటి నుంచి అన్నీ ఈ తమిళ హీరోకి వ్యతిరేకంగానే జరిగాయి. పుట్టుమచ్చల నుంచి సర్టిఫికేట్స్ వరకూ అన్ని వ్యవహారాలు ధనుష్ కు అడ్డం తిరిగాయి. కదిరేశన్ దంపతులు చెప్పిన పుట్టుమచ్చలు ధనుష్ ఒంటిపై ఉన్నా.. వాటిని బలవంతంగా లేజర్ ట్రీట్మెంట్ తో తొలగించుకున్నాడని డాక్టర్లు ధృవీకరించారు. దీంతో ఈ కేసులో ధనుష్ ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ కోర్టు తీర్పు మాత్రం ఆశ్చర్యకరంగా వచ్చింది. ధనుష్ వారి కొడుకే అని నిర్ధారించేందుకు.. కదిరేశన్ దంపతులు చూపిన సాక్ష్యాలు సరిపోవని కోర్టు అభిప్రాయపడింది.

ధనుష్ కి ఈ కేసులో ఊరట లభించడంతో.. అతని కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ కేసు విషయం బయట పడేవరకూ.. తమిళ దర్శకుడు కస్తూరి రాజా కొడుకుగానే ధనుష్ ప్రపంచానికి తెలుసు. మెల్లగా తన ట్యాలెంట్ తో హీరో అయి.. ఆ తర్వాత రజినీకాంత్ అల్లుడిగా స్టార్ హీరోగా అవతరించాడు ధనుష్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/