Begin typing your search above and press return to search.

ఏక్ దో తీన్ పాట‌కు మాధురీ డుమ్మా

By:  Tupaki Desk   |   19 March 2018 5:30 PM GMT
ఏక్ దో తీన్ పాట‌కు మాధురీ డుమ్మా
X
దేశాన్ని ఊపేసినా పాట‌ల్లో తేజాబ్ సినిమాలో ఏక్ దో తీన్ పాట ఒక‌టి. ఆ పాట‌లో న‌ర్తించిన మాధురీ దీక్షిత్ అందరికీ ఫేవ‌రేట్ అయిపోయింది. ఆమె డ్యాన్సుకు కుర్ర‌కారంతా అప్ప‌ట్లో ఊగిపోయారు. ఇప్ప‌టి మాధురీ పేరు చెప్ప‌గానే గుర్తొచ్చేది ఏక్ దో తీన్ పాటే. అలాంటి పాట‌ను రీమిక్స్ చేయ‌కుండా ఇన్నాళ్లు వ‌దిలేయ‌డ‌మే గ్రేట్‌. ఇప్పుడు ఆ పాట‌ను రీమిక్స్ చేసి ఒక బాలీవుడ్ మూవీలో పెట్ట‌బోతున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కూడా పూర్త‌యిపోయింద‌ట‌.

1988లో విడుద‌లైన తేజాబ్ సినిమా విజ‌యానికి ఏక్ దోతీన్ పాట మాధురీ దీక్షిత్ డ్యాన్సు ప్ల‌స్ అయ్యాయి. అందులో ఆమె వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ఇప్పుడు ఆ పాట‌ను బాగీ 2 సినిమా కోసం జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మీద చిత్రీక‌రించారు. జాక్వెలిన్ కూడా అంద‌త్తెనే... డ్యాన్సు కూడా బాగా చేస్తుంది. అందుకే పాటకు ఆమెను ఎంపిక‌చేశారు. అయితే అలనాటి మాధురిని కూడా పాట‌లో చూపించాల‌ని అనుకున్నారు. జాక్వెలిన్‌ తో క‌లిసి ఆమె కూడా పాదం క‌లిపితే పాట హిట్ట‌వుతుంద‌నుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇదే విష‌య‌మై మాధురిని సంప్ర‌దించారు. కానీ అంత ఇష్టాన్ని క‌న‌బ‌ర్చ‌లేద‌ని తెలుస్తోంది. డేట్లు అడ్జ‌స్ట్ కావ‌ని చెప్పి తప్పించుకుంద‌ట మాధురీ. అస‌లు మాధురీ ఇప్పుడు ఏసినిమాల‌లోనూ న‌టించ‌డం లేదు కదా ఈ డేట్ల గోలేంట్రా బాబు అనుకుంటున్నారు సినీ జ‌నాలు.

ఆమె కావాల‌నే ఆ పాట‌కు దూరంగా ఉంటున్న‌ట్టు భావిస్తున్నారు బాలీవుడ్ అభిమానులు. అయినా సరే ప‌ట్టువ‌ద‌ల‌కుండా సినిమా యూనిట్ ఆమెను సంప్ర‌దిస్తూనే ఉంద‌ట‌. ఆఖ‌రికి జాక్వెలిన్ కూడా అడిగింద‌ట. అయినా మాధురీ క‌ర‌గ‌లేదు... త‌న‌కు ప‌నుంద‌ని కొన్ని ప్ర‌యాణాలు చేయాల్సి ఉంద‌ని చెప్పి త‌ప్పించుకుంద‌ట‌. మ‌గ హీరోల‌కే కాదు... హీరోయిన్ల‌కు కూడా ఇగో స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని అర్థ‌మవుతోంది.