Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఇంత వయసులో అంత అందమా

By:  Tupaki Desk   |   19 Sep 2019 4:53 AM GMT
ఫోటో స్టొరీ: ఇంత వయసులో అంత అందమా
X
మాజీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ పేరు తెలియని వారు హిందీ సినిమా ప్రేక్షకులు దాదాపుగా ఉండరు. 80..90 లలో భారీ విజయాలతో బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఆమె భారీగా అభిమానులను సంపాదించుకుంది. నిజానికి శ్రీదేవి తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ సాధించిన బాలీవుడ్ హీరోయిన్ మాధురి మాత్రమే. 'హమ్ ఆప్కే హై కౌన్' లాంటి 'సాజన్' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఆమె లిస్టులో లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ జెనరేషన్ లో ఉన్న చాలామంది బాలీవుడ్ స్టార్స్ ఆమె అభిమానులే.

పాత తరం హీరోయిన్ అయినప్పటికీ ఈవిడ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటారు. తాజాగా మాధురి తన ఇన్స్టా ఖాతా ద్వారా కొత్త ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ ఫోటోలకు "ముందడుగు వేయండి.. తారలా మెరవండి. #ఐఫా" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మాధురి ఎలాగూ తారాపథాన్ని చూసిన వ్యక్తి కాబట్టి ఇలా సభ్య సమాజానికి సందేశం ఇచ్చేందుకు సరైన వ్యక్తి. ఇక ఈ ఫోటోలలో మాధురి ఒక రెడ్ కలర్ గౌన్ ధరించారు. ఒకవైపు స్లీవ్.. మరో వైపు స్లీవ్ లెస్ కావడం తో డ్రెస్ విభిన్నంగా కనిపిస్తోంది. నడుముకు వెడల్పాటి బెల్ట్ డిజైన్ డ్రెస్ అందాన్ని మరింతగా పెంచింది. రెడ్ కలర్ లిప్ స్టిక్.. చెవులకు వెడల్పాటి ఇయర్ రింగ్స్ ధరించి ఒక అందమైన స్మైల్ ఇవ్వడంతో ఏంజెల్ లా కనిపిస్తోంది. ఈ ఫోటోలను చూసినవారు అసలు ఈయసులో ఇంత అందం.. ఎలా ఎ.. లా? అని ఆశ్చర్యానికి గురి కావాల్సిందే.

ఈ ఫోటోలకు నెటిజన్లు సూపర్ కామెంట్లు పెట్టారు. "స్టన్నింగ్ డ్రెస్ మేడమ్".. "ఎవర్ గ్రీన్ బ్యూటీ".. "ఏజ్ లెస్ బ్యూటీ".. "అమేజింగ్ స్టైల్.. బ్యూటిఫుల్" అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. సినిమాల విషయానికి వస్తే మాధురి రెండు నెలల క్రితం రిలీజ్ అయిన 'కళంక్' చిత్రంలో నటించారు. టీవీలో 'డ్యాన్స్ దీవానే' కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.