Begin typing your search above and press return to search.

క్యాస్టింగ్ కౌచ్ పై సినిమా కూడానా?

By:  Tupaki Desk   |   24 April 2018 5:30 PM GMT
క్యాస్టింగ్ కౌచ్ పై సినిమా కూడానా?
X
క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినిపిస్తోంది. హాలీవుడ్ లో గత ఏడాది మొదలైన ఈ వివాదాలు బాలీవుడ్ నుంచి సౌత్ కి అంటుకున్నాయి. చిన్నా పెద్దా హీరోయిన్స్ అందరు చాలా వరకు బయటకు వచ్చి వారికి జరిగిన అన్యాయల గురించి సోషల్ మీడియా ముందు పెట్టేశారు. అయితే హాలీవుడ్ బాలీవుడ్ లో ఓ లెవెల్లో ఈ వివాదం బాగానే సాగినా టాలీవుడ్ లో మాత్రం డోస్ చాలా ఎక్కువైంది.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ కాన్సెప్ట్ పై ఇప్పుడు ఒక సినిమా రాబోతోంది. ఇంతకుముందు కొన్ని సినిమాల్లో క్యాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన సన్నివేశాలు చాలానే వచ్చినా అంతగా క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం సినిమా మొత్తం క్యాస్టింగ్ కౌచ్ పైనే తిరుగుతుందట. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మధుర్ బండార్కర్ ఆ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఫ్యాషన్ - చాందిని బార్ - హీరోయిన్ వంటి సినిమాలతో ఈ బండార్కర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కాని.. ఈ మధ్యన క్యాలెండర్ గాళ్స్ వంటి సినిమాలతో ఫ్లాపులను మూటకట్టుకున్నాడు. కాకపోతే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ బాగా ఇంప్రెస్ చేయడంతో.. దానిపై ఫోకస్ చేసినట్లున్నాడు.

ఈ క్యాస్టింగ్ కౌచ్ సినిమాలో కొంచెం రియాలిటీ ఎక్కువ ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ అనే కాకుండా ఇతర ఇండస్ట్రీ ఆనవాళ్లు కూడా అందులో కనిపిస్తాయట. సెన్సిటివ్ లైన్ తో కూడిన ఈ కథను దర్శకుడు ఏ తరహాలో తెరకెక్కిస్తాడో చూడాలి. మరి కొన్ని రోజుల్లో సినిమాకు సంబంధించిన నటీనటులను ఫైనల్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయాలని మధుర్ బండార్కర్ ప్లాన్ చేస్తున్నారు.