ఫోటో స్టోరి: కష్టమే మధు!!

Thu Apr 20 2017 22:20:32 GMT+0530 (IST)

ఇప్పుడు 40 దాటిన హీరోయిన్లు అందరూ కూడా చక్కగా ఆంటీల క్యారక్టర్లు.. అమ్మలు రోల్స్ వేసేస్తున్నారు. అదే విధంగా సీనియర్ హీరోయిన్ మధుబాల కూడా ప్రయత్నాలు చేసింది. అంతకు ముందు ఆ తరువాత.. సూర్య వర్సెస్ సూర్య వంటి సినిమాల్లో ఆమె తల్లి పాత్రలను పోషించింది. కాని వాటి కారణంగా ఇక్కడ టాలీవుడ్ లో పెద్దగా బిజీ అవ్వలేకపోయింది. అయితే తప్పు మధు సైడ్ నే ఉంది.పై ఫోటో చూడండి.. కారణం ఏంటో మీకే అర్ధమవుతుంది. అసలు మధుబాల లుక్స్ చూస్తుంటే ఏ యాంగిల్లో నుండైనా ఆమె మథర్ క్యారెక్టర్లు వేసే ముదురు బేబీలా ఉందా? కవ్వించే క్లీవేజులు.. రువ్వించే పెదాలు.. ఊరించే అందాలు.. వామ్మో.. ఇంకా అమ్మడు హీరోయిన్ లుక్స్ లోనే ఉంది. అందుకే మనోళ్ళు హీరోలకు తల్లిగా ఈమె అన్ ఫిట్ అని తేల్చేశారు. అలాగే హీరోయిన్ గా పెట్టేసి సినిమాలూ తీసేయలేరు.

నిజానికి యంగ్ వయస్సులో అందం అనేది హీరోయిన్లకు ప్లస్ అయితే.. 40 దాటేశాక కూడా అదే అందం ఉంటే మాత్రం.. క్యారెక్టర్ పాత్రలకు కూడా కలసిరాకపోవచ్చు అనుకోవాలేమో. బహుశా మధుబాలను చూస్తే ఇలాంటి థియరీలే తన్నుకొస్తాయ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/