తిడుతుంటే మహేష్ ఏమనలేదు -మాధవిలత

Mon Apr 16 2018 12:22:01 GMT+0530 (IST)

టాలీవుడ్ లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తమకు కూడా అవకాశాలు ఇవ్వాలని తెలుగమ్మాయిలు స్టార్ హీరోలపై చేస్తోన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో నెటిజన్స్ చేస్తోన్న కామెంట్స్ మరో స్థాయిలో హాట్ టాపిక్ అవుతున్నాయి. రీసెంట్ గా మాధవిలత సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొన్ని ఆరోపణలు చేశారు.ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో.." నేను అతిధి సినిమాలో మహేష్ కో స్టార్ గా వర్క్ చేసినప్పుడు షూటింగ్ కు లేట్ గా వచ్చాను. అయితే 5 నిమిషాల వరకు పక్కన నిల్చోబెట్టి దర్శకుడు నన్ను చాలా అవమానకరంగా తిట్టారు. ఆఖరికి F** OFF అనే మాట కూడా అనేసినట్లు" మాధవీలత తన ఇంటర్వ్యూలో వివరించింది. అయితే ఆ సమయంలో మహేష్ బాబు పక్కనే ఉన్నట్లు ఆమె చెప్పింది. అంతే కాకుండా దర్శకుడి తిడుతుంటే ఒక అమ్మాయిని అసభ్యంగా తిడుతున్నారే అని జాలి లేకుండా కనీసం ఆపడానికి కూడా ట్రై చేయలేదు.

నిజంగా అది దారుణమైన పరిస్థితి అంటూ అందుకే తనకు మహేష్ బాబు అంటే ఇష్టం లేదని తెలిపింది. అయితే నెటిజన్స్ నుంచి మాత్రం భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. షూటింగ్ కి సమయానికి రాకపోతే దర్శకుడు తిట్టాడు. దానికి మాహేష్ కు ఏం సంబంధం అంటూ మాధవీలత కామెంట్స్ కు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.