మేడ్ ఇన్ హెవెన్ లిప్పు లాకు

Mon Feb 18 2019 16:19:21 GMT+0530 (IST)

తెలుగు భామ శోభిత ధూళిపాళ ఫ్యాషన్ ప్రపంచంలో మిస్ ఇండియాగా తన సత్తా చాటి అందరి చూపును తనవైపును తిప్పుకుంది.  మోడల్ గా పేరు తెచ్చుకున్న తర్వాత ఎవరైనా సినిమా రంగం వైపే చూస్తారు.  ఆ ట్రెండ్ ను కొనసాగిస్తూ మొదట హిందీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.   'గూఢచారి' సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది.  ఇప్పుడు వెబ్ సీరీస్ లో నటించి ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతోంది.అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న ఒరిజనల్ డ్రామా 'మేడ్ ఇన్ హెవెన్' లో కీలకపాత్ర పోషించింది. ఈ సీరీస్ లో శోభిత వెడ్డింగ్ ప్లానర్ పాత్రలో నటిస్తోంది.  శోభితకు జోడీగా నటించే అర్జున్ మాథుర్ కూడా వెడ్డింగ్ ప్లానర్ గానే కనిపిస్తాడట.  రీసెంట్ గా ఈ వెబ్ సీరీస్ కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది.   ఇద్దరు వెడ్డింగ్ ప్లాన్లు ఎలా చేస్తారో పెద్దగా చూపించలేదు కానీ ఇద్దరూ కలిసి బెడ్డుపై ఘాటు అధర చుంబనంలో మునిగితేలిపోతున్నారు. అలా అని  లిప్ లాకులు మాత్రమే ఉన్నాయని అనుకోకండి.. అల్ట్రా స్టైలిష్ గెటప్ లో ఉన్న శోభిత ఈ సీరీస్ లో హైఫై ఇంగ్లీష్ యాక్సెంట్ తో కూడా తాట తీస్తోంది.

దీంతో మరో సారి శోభిత సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ అయింది.  ఈ 'మేడ్ ఇన్ హెవెన్' సీరీస్ వచ్చే నెలనుండి స్ట్రీమింగ్ అవుతుందట.  ఇంకా ఆలస్యం ఎందుకు.. తెనాలి బ్యూటీ ఘాటు అవతారాన్ని దర్శించుకొని పునీతులు కండి!