Begin typing your search above and press return to search.

బికినీలో భాయ్ భార్య!!

By:  Tupaki Desk   |   25 Jun 2017 6:49 AM GMT
బికినీలో భాయ్ భార్య!!
X
బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ భార్య మాన్యతా దత్ గతంలో యాక్ట్రెస్ కూడా. అందుకే ఈమెకు ఫిట్నెస్ పై మక్కువ ఎక్కువ. భర్తను.. కవల పిల్లలను ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకునే మాన్యతకు.. ట్రావెలింగ్ అంటే కూడా మహా ఇష్టం.

భర్త సంజయ్ దత్.. కొడుకు షాహ్రన్.. కూతురు ఇక్రాలతో కలిసి ప్రస్తుతం ఈమె లాంగ్ వెకేషన్ టూర్ లో ఉంది. ఇలాంటి సమ్మర్ టూర్స్ అన్నీ బీచ్ సిటీలకే అనే విషయం తెలిసిందే. అయితే.. ఈ సారి టూర్ నుంచి స్పెషల్ గా పిక్స్ ను పోస్ట్ చేస్తోంది మాన్యతా దత్. వీటిలో ఆమె బికినీలో కనిపించే ఫోటోలు కూడా ఉండడం విశేషం. ఫ్యామిలీ టూర్ నుంచి అనేక ఫోటోలను షేర్ చేస్తున్నా.. బికినీలో మాన్యత కనిపించే పిక్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. 'మన చుట్టూ ఉన్నవారితో జీవితం ఎంతో ఆనందంగా గడువుతూ.. వారికి ఏమేం కావాలో తెలుసుకునేందుకు హాలీడే సీజన్ ఎంతో చక్కటి సమయం' అంటూ ఓ ఫిలాసఫీ కూడా చెప్పింది మాన్యత.

సింగిల్ పీస్ బికినీల్లో తన ఫిజిక్ ను పర్ఫెక్ట్ గా ప్రెజంట్ చేస్తూ ప్రస్తుతం ఈ 37 ఏళ్ల మాన్యతా దత్ హాట్ టాపిక్ అయిపోయింది. ఇక సంజయ్ దత్ సినిమాల విషయానికి వస్తే.. తాజాగా భూమి అనే చిత్రాన్ని ఫినిష్ చేశాడు హీరో. అదితి రావు హైదరి కీలక పాత్రలో నటించిన ఈ మూవీ పూర్తి చేసిన మున్నాభాయ్.. గిరీష్ మాలిక్ తీస్తున్న తోర్బాజ్ మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/