Begin typing your search above and press return to search.

‘హైపర్’కు పంచ్ పడేలా ఉందిగా..

By:  Tupaki Desk   |   27 Sep 2016 7:30 AM GMT
‘హైపర్’కు పంచ్ పడేలా ఉందిగా..
X
దసరా దగ్గరికొచ్చేస్తోంది. సెలవులు కూడా మొదలైపోతున్నాయి. దసరా పండక్కి ముందు వచ్చే వీకెండ్లో విపరీతమైన పోటీ ఉండటంతో అంతకంటే ముందు వారమే సినిమాను థియేటర్లలోకి తెచ్చేసి అడ్వాంటేజ్ తీసుకుందామని చూస్తోంది ‘హైపర్’ టీమ్. ఆల్రెడీ సెన్సార్ అయిపోయింది. రిలీజ్ డేట్ మరోసారి కన్ఫమ్ కూడా చేశారు. రామ్ కెరీర్ లోనే ‘హైపర్’ బిగ్గెస్ట్ రిలీజ్ అంటున్నారు. మరే తెలుగు సినిమా దీనికి పోటీ లేకపోవడం కలిసొచ్చే అంశమే. కానీ అనుకోని విధంగా ఓ హిందీ డబ్బింగ్ సినిమా దీనికి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఆ సినిమా మరేదో కాదు.. ఇండియన్ లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథతో తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’.

ధోని సినిమా ఈ సెప్టెంబరు 30కి వస్తుందన్న సంగతి ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లినపుడే ఫిక్స్. ఐతే కేవలం హిందీ వెర్షన్ మాత్రమే వస్తుందనుకున్నారు. కానీ ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకుని రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉండటం.. ప్రమోషన్ కూడా బాగా చేయడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి ఉంది. రెగ్యులర్ సినిమా గోయర్స్ ఎలాగూ చూస్తారు. అలాగే స్పోర్ట్స్ లవర్స్ కూడా ఈ సినిమా మీద ఆసక్తి చూపిస్తారు. కాబట్టి అటు హిందీ వెర్షన్.. ఇటు తెలుగు వెర్షన్ రెండూ కూడా తెలుగు రాష్ట్రాల్లో సత్తా చూపించే అవకాశముంది. మరీ ప్రభావం ఉంటుందని అనుకోలేం కానీ.. ‘హైపర్’ మీద కలెక్షన్ల మీద ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నది వాస్తవం. ఆ ఎఫెక్ట్ ఎంత అన్నది చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/