Begin typing your search above and press return to search.

బాహుబలి-2 రివ్యూపై రగడ

By:  Tupaki Desk   |   30 April 2017 12:57 PM GMT
బాహుబలి-2 రివ్యూపై రగడ
X
నార్త్.. సౌత్ అని తేడా లేదు. అన్ని చోట్లా ‘బాహుబలి: ది కంక్లూజన్’పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సినిమాకు దాదాపుగా అన్ని చోట్లా పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. పూర్తి పాజిటివ్ రివ్యూలు లేకపోయినా.. లోపాల గురించి ప్రస్తావిస్తూనే.. అంతిమంగా ఈ సినిమా ‘మస్ట్ వాచ్’ అన్న అభిప్రాయాన్నే వ్యక్తీకరించారు క్రిటిక్స్. ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలు చాలా అరుదనే చెప్పాలి. ఐతే ఒక ప్రముఖ క్రిటిక్ మాత్రం ‘బాహుబలి: ది కంక్లూజన్’ను చీల్చి చెండాడేస్తూ రివ్యూ రాశారు. ఆ క్రిటిక్ పేరు.. అన్నా ఎంఎం వెటికాడ్.

ఆమె ‘బాహుబలి-2’కు 2.25 రేటింగ్ వేసి విమర్శనాత్మక సమీక్ష రాసింది. ఈ సినిమా చాలా సంకుచితంగా ఉందని.. నటీనటులందరూ చాలా దారుణంగా నటించారని.. నాజర్ ఓవరాక్షన్ భరించలేమని.. ఫైట్లు.. విజువల్స్ లో భారీతనం మినహాయిస్తే సినిమాలో పెద్దగ ఏమీ లేదని.. ఇలా ‘బాహుబలి-2’ను తక్కువ చేస్తూ రివ్యూ రాసింది అన్నా వెటికాడ్. ఈ రివ్యూ మీద ‘బాహుబలి’ అభిమానులు మండిపడుతూ ఆ క్రిటిక్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.

క్రిస్టియన్ అయిన అన్నాకు మత మౌఢ్యం పట్టుకుందని.. హిందువుల పవిత్ర గ్రంథమైన మహాభారతం ఛాయల్లో సాగే ‘బాహుబలి’ మీద ఉద్దేశపూర్వకంగా విషం చిమ్ముతోందని.. పోప్ మీద.. క్రిస్టియానిటీని హైలైట్ చేసేలా సినిమాలు తీస్తే ఆహా ఓహో అనేదంటూ ఆమె మీద విరుచుకుపడ్డారు. తనను తిట్టిన వాళ్ల మీద అన్నా ట్విట్టర్లో ఎదురు దాడికి దిగగా.. ఇంటర్నేషనల్ మీడియా వాళ్లు ఈ గొడవను గుర్తించి దాని మీద న్యూస్ ఇస్తుండటం విశేషం. నెగెటివ్ రివ్యూ రాసినందుకు క్రిటిక్ ను ఇలా టార్గెట్ చేయడం ఏంటని.. ఇది భారతీయుల అసహనానికి నిదర్శనమని.. ఇలా చేయడం సిగ్గుచేటని తీర్మానిస్తూ బ్రిటిష్ మీడియాలో పోస్టులు పెట్టడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/