Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: కళ్యాణ్‌ రామ్ రాజకీయం!!

By:  Tupaki Desk   |   16 March 2018 12:26 PM GMT
ట్రైలర్ టాక్: కళ్యాణ్‌ రామ్ రాజకీయం!!
X
ఇప్పుడు రాజకీయాలు ఎంత వేడిగా ఉన్నాయో.. రాజకీయాలపై ఎక్కుపెడుతున్న సినిమాలు కూడా అంతే వేడిగా వస్తున్నాయి. రానా నేనే రాను నేనే మంత్రి.. నయనతార కర్తవ్యం.. మహేష్‌ బాబు భరత్ అను నేను.. ఇలా రాజకీయ నేపథ్యాల్లో చాలా సినిమాలే వస్తున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో మరో సినిమా కూడా రానుంది. అదే నందమూరి కళ్యాణ్ రామ్ ''ఎమ్మెల్యే'' సినిమా. ఉపేంద్ర మాధవ్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం పదండి.

ఒక ఊరిలో అల్లరి చిల్లరిగా చలాకీగా తిరిగే మంచి లక్షణాలున్న అబ్బాయి కళ్యాణ్‌ రామ్. అదే సమయంలో ఊరికి మంచి చేయాలి.. ఆస్తులిస్తే కరిగిపోతాయ్ చదువులిస్తే వెలిగిపోతారు అంటూ నమ్మే కాజల్ అగర్వాల్. ఇప్పుడు ఆ మంచి పనులు చేసే భాగంగా కొన్ని అవాంతరాలు వస్తే... అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేను ఛాలెంజ్ చేసి.. ఎలా మనోడు ఎమ్మెల్యే అవుతాడు లేక అవ్వడా అనేదే సినిమా. స్టోరి సింపుల్ గానే ఉన్నా కూడా.. ఇలాంటి సినిమాలో కథనంలో మ్యాటర్ బట్టి ఆడేస్తాయి. ఇక్కడ చూస్తుంటే సినిమాలో ఏదో కొత్తగా కొన్ని పాయింట్లు టచ్ చేసినట్లే అనిపిస్తోంది. ఇక కళ్యాణ్‌ రామ్ లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉన్నా.. కాజల్ అగర్వాల్ రొటీన్ గా ఉంది. కాకపోతే డైలాగులు బాగున్నాయ్.

ఇక ప్రసాద్ మురెళ్ళ విజువల్స్ బాగున్నాయనే చెప్పొచ్చు. అలాగే మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. ఇకపోతే మార్చి 23న ఎమ్మెల్యే సినిమా విడుదలవ్వనుంది.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి