ఫస్ట్ లుక్: దుమ్ములేపిన మహేష్ మహర్షి!

Thu Aug 09 2018 01:01:20 GMT+0530 (IST)

యేయ్.. ఈరోజు మన సుపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే. మరి బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యాన్స్ కౌంట్ డౌన్ ఎప్పటినుండో మొదలుపెట్టారు.  ఫ్యాన్స్ కే కాకుండా అందరికీ SSMB25 టీమ్ ఫస్ట్ లుక్ తో మంచి ట్రీట్ ఇచ్చింది.  'జాయిన్ ద జర్నీ ఆఫ్ రిషి'(రిషి ప్రయాణంలో భాగమవ్వండి ) అంటూ 'మహర్షి' అనే టైటిల్ ని ప్రకటించారు మేకర్స్.అందగాడు ఏ డ్రెస్ వేసుకున్నా అందమే.. అసలే టాలీవుడ్ హ్యాండ్సమ్.. పైగా కొద్దిగా అలా గెడ్డం పెంచి  - హెయిర్ స్టైల్ ని అలా మార్చి రఫ్ గా కాలరెగరేస్తే అబ్బో! ఇక నమ్రతాకి కష్టమే పాపం.  ఎప్పుడో 'టక్కరిదొంగ' సినిమాకు తప్ప ఇప్పటివరకూ బియర్డ్ లుక్ లో కనపడలేదు మహేష్. దీంతో కొత్తగా ఉన్నాడు. చెక్స్ ఉన్న బ్రౌన్ కలర్ హాఫ్ షర్ట్ - లైట్ గా ఫేడ్ అయిన జీన్స్ తో లుక్ అదిరిందంతే.  ఇక కుడి చేత్తో కాలర్ ఎగరేస్తున్నా ఎడమ చేత్తో లాప్ టాప్ పట్టుకుని స్టూడెంట్ గెటప్ లో తనలో రెండు యాంగిల్స్ ఉన్నాయని చెప్పకనే చెబుతున్నాడు.

'మహర్షి' టైటిల్ తో గతంలో ఓ తెలుగు సినిమా వచ్చినప్పటికీ ఎందుకో మహేష్ కు ఈ టైటిల్ సెట్ అయిందపిస్తోంది.   ఒక్క లుక్ తో దర్శకుడు వంశీ పైడిపల్లి అందరీనీ థ్రిల్ చేసేసినట్టే.  ఫ్యాన్స్ కి మాత్రం దీంతో పూనకాలే.  మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు మహేష్ - సుకుమార్ కాంబినేషన్ లో నెక్స్ట్  సినిమా ఉంటుందని ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ మహేష్ కి బర్త్ డే విషెస్ తెలిపారు.  మా తుపాకి.కామ్ తరపున కూడా సూపర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు.