Begin typing your search above and press return to search.

చరణ్ ఎంత కష్టపడతాడో మీకేం తెలుసు

By:  Tupaki Desk   |   23 Feb 2017 7:36 AM GMT
చరణ్ ఎంత కష్టపడతాడో మీకేం తెలుసు
X
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో వారసులు ఎక్కువగా ఉన్నారనే మాట వాస్తవమే. అలాగని కష్టపడేవాళ్లకు అవకాశం లేదని అనుకునేందుకు కూడా లేదు. చాలామందికి ఇలా వారసత్వంతో వచ్చిన వారంతా.. చాలా తేలికగా హీరోలు అయిపోతున్నారనే భ్రమ ఉంటుంది. ఇలాంటివారికి పాటల రచయిత బాషా శ్రీ తాజా ఇంటర్వ్యూ ఓ చెంపపెట్టు అనాల్సిందే.

'ఓ బిల్డింగ్ ఎక్కాలనే లక్ష్యం ఉంటే.. మెట్లున్నా ఎక్కుతాం.. తాడు వేసుకుని అయినా ఎక్కుతాం. మెట్లుంటే సపోర్ట్ ఉన్నట్లు. లేకపోతే కష్టపడి ఎక్కుతాం. లక్ష్యమనేది ఉంటే దాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తాం. ఒక సినిమా విషయంలో కష్టపడి పైకొచ్చిన వారికి రామ్ చరణ్ లాంటి వారసులకు చాలానే బాధ్యత తేడా ఉంటుంది. మనకు పేరు ఉండదు.. మనం తీసుకెళ్లేదే పేరు. కానీ తనపై కొండంత బరువు ఉంటుంది. వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అందుకే అందరి కష్టానికి అతని కష్టం 10 రెట్లు ఉంటుంది. మనం 10 శాతం కష్టపడితే.. తను 100శాతం కష్టపడతాడు' అని చెప్పాడు బాషా శ్రీ.

'హార్స్ రైడింగ్ నేర్చుకోవాలని మనం అనుకోం. కానీ తనకు వచ్చు. ఇదొక్కటే అనే కాదు.. అనేక విషయాల్లో రామ్ చరణ్ కష్టం ఎంతో ఉంటుంది' అంటూ వారసత్వం ఉంటే తేలికగా హీరోలు అయిపోవచ్చు అనుకోవడం సరికాదని చెప్పాడు బాషా శ్రీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/