Begin typing your search above and press return to search.

100 కోట్ల నష్టం... శంకర్‌ తలొగ్గక తప్పేలా లేదు

By:  Tupaki Desk   |   19 Feb 2019 6:55 AM GMT
100 కోట్ల నష్టం... శంకర్‌ తలొగ్గక తప్పేలా లేదు
X
భారీ బడ్జెట్‌ చిత్రాలకు పెట్టింది పేరైన శంకర్‌ '2.ఓ' చిత్రాన్ని హాలీవుడ్‌ రేంజ్‌ లో తెరకెక్కించాడు. లైకా ప్రొడక్షన్స్‌ వారు 2.ఓ చిత్రం కోసం శంకర్‌ ఎంత కోరితే అంత ఇచ్చారు. ముందుగా అనుకున్న బడ్జెట్‌ కు మూడు రెట్లు ఎక్కువ అయినా కూడా నిర్మాణ సంస్థ శంకర్‌ పై నమ్మకంతో ఖర్చు పెట్టింది. అయితే తీరా సినిమా విడుదలైన తర్వాత ఫలితం కాస్త అటు ఇటు అయ్యింది. వెయ్యి కోట్లు వసూళ్లు చేస్తుందని భావించిన 2.ఓ చిత్రం ఆ స్థాయిని రీచ్‌ కాలేక పోయింది. థియేట్రికల్‌ రైట్స్‌ మరియు ఇతరత్ర రైట్స్‌ ద్వారా వచ్చిన మొత్తం, బడ్జెట్‌ ఇలా మొత్తం లెక్కలు చూడగా 2.ఓ చిత్రం దాదాపుగా 100 కోట్ల నష్టాన్ని లైకా వారికి మిగిల్చిందట. దాంతో వారు ఇప్పుడు అదే శంకర్‌ తో తీస్తున్న 'భారతీయుడు 2' చిత్రం విషయంలో కొన్ని కండీషన్స్‌ పెడుతున్నారు.

'భారతీయుడు 2' చిత్రాన్ని 200 కోట్ల బడ్జెట్‌ తో తీస్తానంటూ లైకా వారికి శంకర్‌ ప్రపోజల్‌ ఇచ్చాడట. ఆ ఉద్దేశ్యంతోనే సినిమా పనులు మొదలు అయ్యాయి. అయితే తాజాగా 2.ఓ లెక్కలు తేలిన తర్వాత శంకర్‌ భారతీయుడు 2 బడ్జెట్‌ ఎంత పెంచుతాడో అంటూ భయపడుతున్నారట. శంకర్‌ ను 250 కోట్లతో సినిమాను ఫినీష్‌ చేస్తానంటూ అగ్రిమెంట్‌ ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారట. అయితే శంకర్‌ మాత్రం సినిమా బడ్జెట్‌ పెరిగితే తానేం చేస్తాను, బడ్జెట్‌ పెరగకుండా ఎలా సినిమా చేస్తాము, అలా అగ్రిమెంట్‌ ఎలా ఇస్తానంటూ తాత్కాలికంగా సినిమాను నిలిపేశాడట.

లైకా వారితో కాకుండా మరో నిర్మాణ సంస్థతో భారతీయుడు 2 చిత్రాన్ని తీయాలనే శంకర్‌ భావిస్తున్నాడట. ఇప్పటికే పలువురు నిర్మాతలతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. గతంలో ఈ చిత్రంపై ఆసక్తి చూపించిన దిల్‌ రాజుతో కూడా చర్చలు జరిగాయట. ఎవరైనా కూడా 150 నుండి 200 కోట్ల వరకు పెట్టగలం అని మాత్రమే చెబుతున్నారట. దాంతో 250 కోట్ల బడ్జెట్‌ పెడతామన్న లైకా వారితోనే ఈ సినిమా చేసేందుకు శంకర్‌ అగ్రిమెంట్‌ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్‌ విషయంలో శంకర్‌ రాజీ పడేందుకు అస్సలు ఇష్టపడడు. మరి భారతీయుడు 2 చిత్రంకు రాజీ పడకు తప్పని పరిస్థితి ఎదురైంది. మరి ఈ సమయంలో శంకర్‌ ఏ చేస్తాడనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం.