Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: క్యూట్ ల‌వ్ స్టోరీ`ల‌వ‌ర్`!

By:  Tupaki Desk   |   14 July 2018 12:40 PM GMT
ట్రైలర్ టాక్: క్యూట్ ల‌వ్ స్టోరీ`ల‌వ‌ర్`!
X
ల‌వ‌ర్ బాయ్ రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న‌ రిధి కుమార్ జంట‌గా న‌టిస్తోన్న `ల‌వ‌ర్ `చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఈ చిత్ర ప్ర‌మోష‌న్ లో భాగంగా నేడు ట్రైల‌ర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్ర ట్రైల‌ర్ లో ల‌వ్, కామెడీ, సెంటిమెంట్...ఇలా అన్ని హంగులు క‌ల‌గ‌లిపి ఉన్నాయి. ల‌వ‌ర్ బాయ్ గా రాజ్ త‌రుణ్ ఆక‌ట్టుకున్నాడు. మ‌ల‌యాళి న‌ర్స్ పాత్ర‌లో రిధి ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా వీరిద్ద‌రి మ‌ధ్య‌లో కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయింది. హాస్ప‌ట‌ల్ లో వారిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే కామెడీ స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగులతో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలున్న నేప‌థ్యంలో....తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ ఆ అంచ‌నాలను మ‌రింత పెంచింది.

ఈ ఏడాది దిల్ రాజు బ్యాన‌ర్ నుంచి మ‌రో చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోన్న దిల్ రాజు...మ‌రో ల‌వ్ స్టోరీ తో ముందుకు వ‌చ్చారు. ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ఉన్న రాజ్ త‌రుణ్ తో క్యూట్ ల‌వ్ స్టోరీని ఎంచుకున్నారు. నిర్మాణ విలువ‌ల విష‌యంలో దిల్ రాజు ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. అనిష్ కృష్ణ తెర‌కెక్కించిన ఈ ప్రేమ క‌థా చిత్రం త‌ప్ప‌క ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. వ‌రుస ప్లాప్ ల‌తో స‌త‌మ‌త‌మవుతోన్న రాజ్ త‌రుణ్ ఈ సినిమాతో ట్రాక్ పైకి రావాల‌ని క‌సితో న‌టించాడు. జులై 20 న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.