నెక్స్ట్ ఏంటి లవర్ బాబు?

Thu Jun 21 2018 12:10:07 GMT+0530 (IST)

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న రాజ్ తరుణ్ కు టైం ఏ మాత్రం కలిసి రావడం లేదు. సరికదా సెల్ఫ్ గోల్ తరహాలో తేడా ఫలితాలు ఇస్తూనే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో అన్నపూర్ణ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ లో రంగుల రాట్నం చేస్తే టీవీలో వచ్చే దాకా అది విడుదలైన విషయం చాలా మందికి తెలియనంత దారుణంగా ఫెయిల్ అయ్యింది. ఇక మొన్న వచ్చిన రాజుగాడు సంగతి సరేసరి. టీవీలో వచ్చినా ఇది కొత్తగా పాతదా అని అడిగేలా  ఉన్నారు ప్రేక్షకులు. పాపం కోరి మరీ ఇద్దరు లేడీ డైరెక్టర్స్ ని నమ్మి వాళ్ళతో చేస్తే  తేడా కొట్టడం బహుశా ఏ హీరోకి చూసుకున్నా ఇదే మొదటి సారి అని చెప్పొచ్చు.అలా అని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా రాజ్ తరుణ్ కి కలిసి రాలేదు. గత ఏడాది కూడా రెండు  ప్లాపులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇవన్నీ ఎంత లేదన్నా రాజ్ తరుణ్ ఇమేజ్ పై తీవ్ర ప్రభావం చూపించాయి. ఇప్పుడు దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత నిర్మించినా హైప్ తెచ్చుకోవడానికి లవర్ సినిమా పురిటి నొప్పులు పడుతోంది. ఫస్ట్ లుక్ - టీజర్ ఏ మాత్రం బజ్ తేకపోవడంతో ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది. ఇప్పుడు లవర్ సూపర్ డూపర్ హిట్ అయితే తప్ప రాజ్ తరుణ్ బౌన్స్ బ్యాక్ కావడం కష్టం. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడు డీల్ చేసిన మూవీ కనక విడుదల అయ్యే దాకా అతని కెపాసిటీని  నమ్మలేని పరిస్థితి. అందుకే రాజ్ తరుణ్ తో  సీకే బ్యానర్ లో చేయాల్సిన కొత్త సినిమా సందిగ్ధంలో పడిపోయిందని ఇన్ సైడ్ టాక్.

ఎంత తక్కువ బడ్జెట్ లో తీసినా నిర్మాణ పరంగా సేఫ్ అవుతున్నప్పటికీ బిజినెస్ విషయంలో రాజ్ తరుణ్ సినిమాలు నష్టాలే ఇస్తున్నాయి. బయ్యర్లు ముందుకు రావడం లేదు. అందుకే లవర్ విజయం కీలకంగా మారింది. లవర్ టైటిల్ యూత్ టార్గెట్ గా అనిపిస్తున్నా ట్రెండీగా అయితే లేదు. కొన్నేళ్ల క్రితమే నాగ అశ్విన్ లవర్స్ అనే సినిమా చేసాడు. అదే రిపీట్ అయిన ఫీలింగ్ కలిగిస్తోంది. సో ఇకపై చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉండటం రాజ్ తరుణ్ కు అంత ఈజీ కాదు. నాలుగైదు పరాజయాలు యూత్ హీరోకు వచ్చాయి అంటే అది చిన్న విషయం కాదు. ఎక్కడ పొరపాటు జరుగుతోందో రాజ్ తరుణ్ గుర్తిస్తే మంచిది. లేకపోతే అద్భుతమైన హిట్స్ కొట్టి కూడా తక్కువ టైంలోనే కనుమరుగైన యూత్ హీరోల బ్యాచ్ లో చేరే ప్రమాదం ఉంది. సో ఈ ఏడాది కెరీర్ పరంగా రాజ్ తరుణ్ కు లైఫ్ అండ్ డెత్ అనే చెప్పాలి.