Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: పాడుబడ్డ బంగాళాలో అంజలి

By:  Tupaki Desk   |   17 Nov 2018 4:43 AM GMT
టీజర్ టాక్: పాడుబడ్డ బంగాళాలో అంజలి
X
తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తమిళ హారర్ చిత్రం 'లిసా'. ఈ సినిమాలో యోగి బాబు.. మకరంద్ దేశ్ పాండే.. మైమ్ గోపిలు ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈమధ్యే ఈ సినిమా టీజర్ విడుదల అయింది. 'జల్సా' లో ముకేష్ రుషి పాత్ర "బెదిరింపుకి భాష అవసరం లేదు.. అర్థమైపోతుంది" అంటాడు. ఇది కూడా అంతే.. తమిళ టీజరే అయినా 'భయం' కాబట్టి మీకు అర్థం అయిపోతుంది.

ఒక ఇల్లు.. అందులో దెయ్యం. హీరోయిన్ అంజలి మాత్రం ఈ ఇంట్లో అలాంటిదేమీ లేదంటుంది. ఎవరైనా పక్కనోళ్ళు మొత్తుకుంటే ఇలాంటివి నమ్మరు కదా. సొంతంగా చూస్తే అప్పుడు నమ్ముతారు. అలాగే అంజలి కి ఒకటి రెండు ఝలక్కులు తగిలిన తర్వాత నమ్ముతుంది. 'పది తర్వాత అసలు లైట్ వేయకూడదు' అంటూ ఒక భయాన్ని పెంచే డైలాగ్ చెప్పారు. లైట్ వేస్తే అక్కడ దెయ్యాలు తాపీగా కూర్చుని ఉంటాయి. ఇక అంజలికి మాటలు రావు! బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాటోగ్రఫీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి.

ఇది ఇండియాలోనే హారర్ జోనర్లో తెరకెక్కిన మొదటి 3డీ సినిమా అని ఫిలిం మేకర్స్ ప్రకటించారు. అంటే 2D ఫ్లాట్ స్క్రీన్ పై చూసి భయపడకుండా ఎంచక్కా మనపక్కనో.. నెత్తిపైనో దెయ్యాన్ని చూసి హాయిగా భయపడొచ్చు. ఫుల్ గా ఎంజాయ్ చెయ్యొచ్చు. ఈ సినిమాకు దర్శకుడు రాజు విశ్వనాథ్. సంతోష్ దయానిధి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో మన బ్రహ్మానందం కూడా ఉన్నాడోచ్.. ఇంకా ఎందుకు ఆలస్యం.. టీజర్ పారుంగ..!