Begin typing your search above and press return to search.

ఇలా సైకిల్ తొక్కితే అందరూ బీచ్ లోనే

By:  Tupaki Desk   |   17 March 2018 1:06 PM GMT
ఇలా సైకిల్ తొక్కితే అందరూ బీచ్ లోనే
X
బీచ్ లో ఎప్పుడైనా సైకిల్ తొక్కారా.. పోనీ తొక్కే వాళ్లను చూశారా.. మీరు సముద్ర తీరాన ఎన్ని వింతలు అయినా చూసి ఉండొచ్చు కానీ.. అందాల భామ లీసా హేడెన్ మాదిరిగా సముద్రపు అలల కంటే తన అందాలనే ఎక్కువగా హోరెత్తించిన వాళ్లను మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు.

అంతగా బీచ్ ఒడ్డును కూడా వేడెక్కించేసింది చెన్నై భామ లీసా హేడెన్. ప్రస్తుతం ఈ భామ తన కుటుంబంతో కలిసి సమ్మర్ టూర్ ఎంజాయ్ చేస్తోంది. మరి ఫ్యామిలీ వరకే హ్యాపీగా ఉంటే ఎలా.. తన ఫ్యాన్స్ ను కూడా హుషారెత్తించాలి కదా.. అందుకే ఎంచక్కా బీచ్ లో సైక్లింగ్ చేసేస్తూ కొన్ని స్నాప్స్ తీయించుకుని నెట్ లో పెట్టేసింది. ఇంతవరకూ సహజమే కానీ.. ఇక్కడ లీసా మాత్రమే చేయగలిగిన పని ఏంటంటే.. ఓ సింగిల్ పీస్ బికినీ మాత్రమే వేసుకుని సైకిల్ తెగ తొక్కేసింది. అసలే ఆ బికినీ అమ్మడి అందాలను దాచలేక నానా తంటాలు పెడుతుంటే.. దానికి మరింతగా పని కల్పించేసింది లీసా.

సోయగాల సుందరి ఇంతలా రెచ్చిపోవడం అందరూ షాక్ తినేస్తున్నారు. ఇక్కడ అంతకంటే ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే.. గతేడాది మే నెలలో ఈ బ్యూటీ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అంటే పుట్టిన బిడ్డకు ఏడాది సమయం రావడానికి ఇంకా రెండు నెలలకు పైగా టైం ఉందన్న మాట. ఇంతలోనే అంత గ్లామర్ గా మారిపోవడమే కాకుండా.. సోయగాలను తెగ ఎగ్జిబిట్ చేసేస్తోంది లీసా హేడెన్. ఈ రేంజ్ లో బీచ్ లో లీసా సైకిల్ తొక్కుతుందని ముందే తెలిస్తే.. మొత్తం అభిమానులు అందరూ ఆ బీచ్ ను వెతుక్కుంటూ వెళ్లిపోవడం ఖాయం.