Begin typing your search above and press return to search.

బుర్ఖా క్రింద లిప్ స్టిక్.. అదిరిందంటలే

By:  Tupaki Desk   |   26 Oct 2016 3:30 PM GMT
బుర్ఖా క్రింద లిప్ స్టిక్.. అదిరిందంటలే
X
''లిప్‌ స్టిక్ అండర్ మై బుర్ఖా'' అంటూ ఒక సినిమా వస్తోంది. అసలు ఈ టైటిల్ వింటేనే చాలా షాకింగ్ గా ఉంది కదూ. భారతదేశంలో ఎంతటి డెమోక్రసీ ఉన్నప్పటికీ.. ఇలా ఒక మతం తాలూకు కాస్ట్యూమ్ ను వాడుకుంటే టైటిల్ పెడితే.. ఖచ్చితంగా అది కాంట్రోవర్సీలకు దారి తీసే ఛాన్సుంది. కాని ఈ లేడీ డైరక్టర్ అసలు సినిమాలో ఏం చూపించిందో చూస్తే మాత్రం.. మీరు అంతకంటే ఎక్కువే షాక్ తింటారు.

అలంకృత శ్రీవాత్సవ అనే దర్శకురాలు.. ఇప్పుడు ''లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా'' అంటూ ఒక సినిమాను తీసింది. జీవితంలో వివిధ స్టేజీల్లో ఉన్న నలుగురు మహిళల కథే ఈ సినిమా. ఏజ్ అయిపోతున్న ఒకావిడ.. యంగ్ గా రెడీ అయ్యి.. కుర్రాళ్ళతో ఎంజాయ్ చేయాలని అనుకుంటుంది. అలాగే బుర్ఖాలోనే జీవితం గడిపేస్తున్న ఒక పెళ్లయిన మహిళ (కొంకణా సేన్‌).. ఆ బుర్ఖాను తీసిపాడేసి చక్కగా స్నేహితురాళ్ళతో ఎంజాయ్ చేయాలని అనుకుంటుంది. పెళ్లి ఫెయిలైనా కూడా ఇతర అబ్బాయిలతో హ్యాపీగా సెక్స్ చేసుకుంటూ.. ఆ మూమెంట్స్ కూడా సెల్ఫీలు తీసుకుని టైమ్ పాస్ చేయాలనుకునే మరో అమ్మాయి. ఇలా ఎవరి టార్గెట్లు వారికి ఉంటాయ్. చివరకు వీరి జీవితం ఏమవుతుంది అనేదే సినిమా. టోక్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఔరా అనిపించుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ముంబయ్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శిస్తున్నారు. సినిమా అదిరిపోయిందని చూసినవారి టాక్.

తీసింది మనోళ్ళే.. సినిమాలో మాట్లాడేది హిందీ బాషే.. బోపాల్ నగరంలో జరిగే ఓ కథగా మలిచింది దర్శకురాలు. మరి సినిమాకు సెన్సార్ అడ్డంకులు లేకుండా రిలీజ్ అవుతుందా? ఆ విషయం తెలియదు కాని.. ఇంటర్నేషనల్ గా ఈ సినిమాను ఇప్పటికే ప్రఖ్యాత డిస్ర్టిబ్యూషన్ కంపెనీలు కొనేశాయట.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/