Begin typing your search above and press return to search.

కిస్ తీశారు.. చింపారు.. తెచ్చారు

By:  Tupaki Desk   |   22 Aug 2017 4:14 AM GMT
కిస్ తీశారు.. చింపారు.. తెచ్చారు
X
ఒక సినిమాలో అసలు కొన్ని సీన్లు ఎందుకు తీస్తారు అని కొంతమందికి సందేహం ఉంటుంది. ఒక పూర్తి స్థాయి లిప్ కిస్ ను సినిమాలో పెడితే.. దానిని ఖచ్చితంగా సెన్సార్ వారు తీసేస్తారని తెలుసు. కాని మనోళ్ళు అవే ఎందుకు తీస్తారు? కట్ చేస్తారని తెలిసినా కూడా ఎందుకు అవే సీన్లను సినిమాలో పెడతారు? ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ''అర్జున్ రెడ్డి'' ఒక విషయాన్ని మళ్లీ ప్రూవ్ చేసింది. ఆ థీరమ్ ఏంటో ఒకసారి చూడండి.

ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాలో ఒక లిప్ కిస్ సీన్ ఉంటుందని.. దాని కోసం యాక్టర్లు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారంటూ ఒక వీడియో ''తీశారు''. రిలీజ్ చేశారు. కట్ చేస్తే హైప్ వచ్చింది. సినిమాలో కిస్ ఉందంటూ ట్రైలర్లో చూపించారు. కట్ చేస్తే హైప్ పెరిగింది. ఆ తరువాత పోస్టర్లలో కిస్ సీన్ వేసేశారు. కట్ చేస్తే హైప్ ఇంకా పెరిగింది. పెరుగుతూనే ఉంది. ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్లు ఆ సినిమా పోస్టర్లను ''చింపారు''. దానితో ఈ హైప్ ఇంకా పెరుగుతూనే ఉంది. సో ఓవరాల్ గా తెలియాల్సింది ఏంటంటే.. ఒక్క లిప్ కిస్ సీన్ తో సినిమాకు కావల్సినంత పబ్లిసటీ ''తెచ్చారు''. ఆ విషయం అర్దంచేసుకోవాలంతే.

ఇకపోతే లిప్ కిస్ అంటే ప్రేమను చెప్పాడానికి ఒక పీక్ ఎక్స్ ప్రెషన్ అని చెప్పొచ్చు.. కాకపోతే ఇంకా ఏ-సర్టిఫికేట్ సినిమాల్లో కూడా లిప్ కిస్ చూసేంత మెచ్యూరిటీ మన ఆడియన్స్ కు రాలేదనేది మన సెన్సార్ బోర్డు ఫీలింగ్. కానివ్వండి!!