సాహో టీంకు క్లియరెన్స్ వచ్చేసిందహో..

Sun Jan 21 2018 11:50:06 GMT+0530 (IST)

అంతా అనుకున్నట్లు జరిగితే ‘సాహో’ సినిమాకు ప్రధాన ఆకర్షణ అనదగ్గ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ ఈపాటికి అయిపోవాల్సింది. కానీ షెడ్యూల్ ప్లాన్ చేసుకుని.. కాస్ట్ అండ్ క్రూ అంతా కలిసి దుబాయ్ చేరుకుని ఇక షూటింగ్ ఆరంభించడమే తరువాయి అనుకున్న తరుణంలో పెద్ద షాక్ తగిలింది. వీళ్లు షూటింగ్ చేయాలనుకున్న కొన్ని ప్రాంతాల్లో అనుమతులు రాలేదు. అనుకున్న ప్రకారం షూటింగ్ చేసే పరిస్థితి కనిపించలేదు అలాగని అక్కడే పడిగాపులు కాస్తే మొత్తం డేట్లు తారుమారైపోతాయి. అందుకే ప్లాన్-బికి వెళ్లిపోయింది ‘సాహో’ టీం. లేటుగా అనుకున్న ‘సాహో’ హైదరాబాద్ షెడ్యూల్ ను ముందుకు తీసుకొచ్చారు. భాగ్యనగరంలో కొన్ని సీన్లు చిత్రీకరించారు.మళ్లీ ఇప్పుడు దుబాయ్ పయనానికి సన్నాహాలు పూర్తి చేశారు. ఒక టీం దుబాయ్ లోనే ఉండి అక్కడి వ్యవహారాలన్నీ చక్కబెట్టింది. అనుకున్న చోట షూటింగ్ చేయడానికి అనుమతులు మంజూరయ్యాయి. కొంచెం బ్రేక్ తీసుకుని ఫిబ్రవరి 25 నుంచి అక్కడ షూటింగ్ చేయడానికి ప్రణాళిక వేసుకుంది చిత్ర బృందం. ఇంతకుముందు 75 రోజుల పాటు దుబాయ్ లో షూటింగ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు 15 రోజుల కోత పడింది. 60 రోజుల్లోనే ఈ షెడ్యూల్ పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఆ షెడ్యూల్ అయితే సినిమా దాదాపుగా పూర్తి కావచ్చినట్లేనట. బ్యాలెన్స్ షూట్ అంతా ఒక షెడ్యూల్లో పూర్తి చేసేస్తారట. ఈ ఏడాది ప్రథమార్ధంలోనే షూటింగ్ అయిపోవచ్చని అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కు కొంచెం టైం పడుతుంది. దసరా లేదా దీపావళి టైంకి ‘సాహో’ ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.