Begin typing your search above and press return to search.

సాహో: ప్రభాస్ తో పాటు లెస్ ట్విన్స్ స్టెప్పులు

By:  Tupaki Desk   |   19 Jan 2019 4:48 AM GMT
సాహో: ప్రభాస్ తో పాటు లెస్ ట్విన్స్ స్టెప్పులు
X
రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' పై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. అప్డేట్లు లేవంటూ గొడవ చేస్తున్న అభిమానులను శాంతపరచడానికా అన్నట్టు 'షేడ్స్ ఆఫ్ సాహో -చాప్టర్ 1' మేకింగ్ వీడియో టీజర్ ను అక్టోబర్లో విడుదల చేస్తే ఆది ప్రేక్షకులనందరినీ థ్రిల్ చేసింది. 'సాహో' స్టాండర్డ్ ఏ రేంజ్ లో ఉందో ఒక్కసారిగా అందరికీ అర్థం అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు 'సాహో' కు సంబంధించిన మరో అప్డేట్ ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉంది.

ఈ సినిమాలో ఒక పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న డ్యాన్సర్స్ లెస్ ట్విన్స్ ప్రభాస్ తో కలిసి డ్యాన్స్ చేస్తారట. లారెంట్ నికోలస్.. ల్యారీ నికోలస్ అనే పేరున్న ఈ కవలలు పలు ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో స్టెప్పులేశారు. బియోన్స్.. మిస్సీ ఎలియట్.. మేగన్ ట్రైనర్ లాంటి ఇంటర్నేషనల్ పాప్ సింగర్స్ మ్యూజిక్ వీడియోలలో లెస్ ట్విన్స్ డ్యాన్స్ వేయడం విశేషం. 'సాహో' లో ఈ పాటకు వీరిద్దరినే కాకుండా ఇతరదేశాలకు చెందిన మరికొందరు డ్యాన్సర్లను కూడా తీసుకుంటున్నారట.

ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవ్ మర్చంట్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తాడని సమాచారం. ఈ పాటను భారీ స్థాయిలో తెరకెక్కిస్తారని అంటున్నారు. ఈ సినిమాకు శంకర్ - ఎహసాన్ - లాయ్ త్రయం సంగీతం అందిస్తున్నారు. ఈ రేంజ్ ఇంటర్నేషనల్ సాంగ్ మాత్రం టాలీవుడ్ కు కొత్తే.