#మీటూ : ఆమె ట్వీట్ శింబు గురించేనా..?

Mon Oct 22 2018 19:17:45 GMT+0530 (IST)

బాలీవుడ్ లో మీటూ అంటూ పదుల సంఖ్యలో మహిళలు మరియు హీరోయిన్స్ తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. ఇప్పటి వరకు పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారి పేర్లు లైంగిక వేదింపు ఆరోపణలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో బాలీవుడ్ మొత్తం చర్చనీయాంశం అవుతుంది. బాలీవుడ్ వరకు పరిమితం అయిన మీటూ ఉద్యమం మెల్ల మెల్లగా సౌత్ కు కూడా పాకుతుంది. సౌత్ లో మొదట చిన్మయి మీటూ అంటూ వైరముత్తు మరియు మరికొందరిపై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత సౌత్ స్టార్ హీరో అర్జున్ పై హీరోయిన్ శృతి హరిహరన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు తమిళ స్టార్ హీరో శింబు కూడా లైంగిక వేదింపులకు పాల్పడ్డాడా అనే అనే చర్చ జరుగుతుంది.తమిళ హీరోయిన్ లేఖ వాషింగ్టన్ ట్విట్టర్ లో మీటూ హ్యాష్ ట్యాగ్ తో కెట్టవన్ అంటూ ట్వీట్ చేసింది. కెట్టవన్ అనేది శింబు నటించిన సినిమా పేరు. అందుకే శింబుపైకి అందరి దృష్టి మళ్లింది. లేఖ కెట్టవన్ అంటూ ట్వీట్ చేసిన నేపథ్యంలో ఆమెను శింబు లైంగికంగా వేదించాడేమో అని - అందుకే ఆమె సినిమా పేరుతో ట్వీట్ చేసి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెట్టవన్ షూటింగ్ సమయంలో శింబు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి ఉంటాడని - లేదంటే ఆ చిత్రంకు సంబంధించిన వారు ఎవరైనా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి ఉంటారనే టాక్ వినిపిస్తుంది.

లేఖ ట్వీట్ పై చర్చ జరుగుతున్న సమయంలో శింబు ఆఫీస్ నుండి వెంటనే ఒక ప్రకటన వెలువడినది. కెట్టవన్ చిత్రం షూటింగ్ సమయంలో ఎలాంటి సంఘటనలు జరగలేదని - ఆమె ఎందుకు ఆ సినిమా పేరుతో ట్వీట్ చేసిందో తెలియదని ఆమె క్లారిటీ ఇవ్వకుండా శింబు పేరుతో తప్పుడు వార్తలు రాయడం మంచి పద్దతి కాదు అంటూ వారు ప్రకటనలో పేర్కొనడం జరిగింది. అయినా కూడా శింబుకు ఉన్న పేరు నేపథ్యంలో ఆమెను శింబు వేదించాడేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.