లీగల్ సమస్యల్లో స్టార్ హీరోయిన్

Wed Jun 12 2019 12:59:12 GMT+0530 (IST)

తమిళం మరియు తెలుగులో స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతూ లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటున్న నయన తార ఒక వైపు స్టార్ హీరోల సరసన కమర్షియల్ పాత్రల్లో కనిపిస్తూనే మరో వైపు విభిన్నమైన పాత్రలో నటిస్తూ లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. ఈమె పలు లేడీ ఓరియంటెడ్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రభావం చూపాయి. ఇటీవలే ఐరా అనే చిత్రంతో మంచి సక్సెస్ ను తమిళంలో అందుకుంది. తాజాగా నయన్ 'కోలైయుతీర్ కోలాం' అనే చిత్రంలో నటించింది.కోలైయుతీర్ కోలాం చిత్రం ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాని సినిమాకు లీగల్ సమస్యలు చుట్టు ముట్టిన నేపథ్యంలో విడుదల అవ్వడం కష్టం అయ్యింది. ఈ చిత్రంను ఓ నవల ఆధారంగా చక్రి తోలేటి తెరకెక్కించాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్ కూడా అయ్యింది. ఇలాంటి సమయంలో తాను హక్కులు కొనుగోలు చేసిన నవల ఆధారంగా చక్రితోలేటి సినిమాను తీశాడు అంటూ మరో దర్శకుడు కేసు వేశాడు.

కేసు విచారణకు స్వీకరించిన కోర్టు చిత్ర యూనిట్ సభ్యులు అయిన దర్శకుడు.. నిర్మాత మరియు హీరోయిన్ నయనతారలకు నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. ఈనెల 21 వరకు సమాధానం ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. జెట్ స్పీడ్ తో దూసుకు వెళ్తున్న నయన్ కు ఇది సడెన్ బ్రేక్ అనుకోవాలి. నయన్ వరుసగా సినిమాలు చేస్తున్న ఇలాంటి సమయంలో లీగల్ సమస్యల వల్ల సినిమా ఆగిపోవడం ఆమె అభిమానులకు నిరుత్సాహం కలిగిస్తుంది. ఈ లీగల్ సమస్యల నుండి నయన్ అండ్ టీం ఎలా బయట పడతారో చూడాలి.