పైసా ఖర్చు లేకుండా కోట్ల పబ్లిసిటీ

Mon Feb 18 2019 11:13:09 GMT+0530 (IST)

రామ్ గోపాల్ వర్మ మీద ప్రేక్షకులు నమ్మకం పోగొట్టుకుని ఏళ్ళు గడిచిపోయింది. ఎక్కడ తన మీద ఆశలు పెంచుకుంటారో అనే భయంతో అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పీడకల లాంటి సినిమాలు ఇస్తున్న వర్మ గత ఏడాది నాగార్జునకు ఇచ్చిన ఆఫీసర్ షాక్ కి ఆయనేమో కానీ అభిమానులు ఇప్పటికీ కోలుకోలేదు. అయినప్పటికీ తన ప్రతి కొత్త ప్రాజెక్ట్ కు హైప్ ఎలా తెచ్చుకోవాలో వర్మకు బాగా తెలుసు. దానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ ని మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ఎన్టీఆర్ రెండో పెళ్లి తర్వాత సంఘటనలను నేపధ్యంగా తీసుకుని చంద్రబాబుని టార్గెట్ గా వెన్నుపోటు ఎపిసోడ్ ని హై లైట్ చేస్తూ తీసిన దీని ట్రైలర్ ఇప్పటికే సంచలనాలు సృష్టించింది. వర్మను నమ్మకూడదు అంటూనే ఇప్పటిదాకా ప్రేక్షకులు దానికి 7 మిలియన్ల వ్యూస్ ఇచ్చేసారు. ట్రెండింగ్ లో నెంబర్ 3 లో ఉంది. దాన్ని సైతం ప్రచారానికి వాడుకుంటూ ఎన్టీఆర్ ఆశీసులు తన సినిమా మీద ఉన్నాయని ప్రత్యేకంగా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు

అంతే కాదు డిజిటల్ వ్యూస్ కోటి దాటేశాయని కూడా ప్రచారం మొదలుపెట్టాడు. అధికారికంగా యుట్యూబ్ లోనే ఈ సంఖ్య 70 లక్షలు దాటేసింది కాబట్టి అది పూర్తిగా అబద్దమని కొట్టేయలేం. వర్మ ట్రైలర్లలో ఉన్న సరుకు సినిమాలో ఉండదు అని ఎన్నోసార్లు ప్రూవ్ అయినప్పటికీ అభిమానులు లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద మాత్రం కొద్దో గొప్పో నమ్మకం పెట్టుకున్నారు.

అది సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను బట్టి గమనించవచ్చు. ట్రైలర్ లో చూపించిన కంటెంట్ నిజంగా తెరిమీద అదే స్థాయిలో చూపిస్తే వర్మ హిట్టును నమ్ముకోవచ్చు. లేదా కథ మళ్ళి మొదటికే వస్తుంది. ఇంకో కొత్త సినిమాతో ప్రచారం ద్వారా ప్రేక్షకులను ఎలా అమాయకులను చేయాలా అనే ప్లానింగ్ లో వర్మ బిజీ అయిపోతాడు.