Begin typing your search above and press return to search.

లక్ష్మీరాయ్.. ఏం జిమ్మిక్కులు చేస్తోందో!

By:  Tupaki Desk   |   31 Aug 2015 4:08 PM GMT
లక్ష్మీరాయ్.. ఏం జిమ్మిక్కులు చేస్తోందో!
X
దశాబ్దం కిందట హీరోయిన్ గా అరంగేట్రం చేసిన లక్ష్మీరాయ్ ఎప్పుడూ కూడా హీరోయిన్ గా బిజీ అవ్వలేదు. టాలీవుడ్ జనాలు పట్టించుకోకపోయేసరికి.. కోలీవుడ్ వెళ్లి అదృష్టం పరీక్షించుకుంది. అయినా పెద్దగా ఫలితం లేదు. ఏవో చిన్నా చితకా పాత్రలతో కాలం నెట్టుకొచ్చేస్తోంది. మధ్యలో ధోనితో ఎఫైర్ వార్తల పుణ్యమా అని మంచి పబ్లిసిటీ తెచ్చుకుని కొన్ని అవకాశాలు పట్టింది. ఆ తర్వాత కథ మళ్లీ మామూలే. ఇప్పుడేవో ఒకటీ అరా హార్రర్ సినిమాలు చేసుకుంటూ కెరీర్ సాగిస్తోంది. ఐతే ఈ సినిమాల విషయంలో లక్ష్మీరాయ్ చేస్తున్న పబ్లిసిటీ జిమ్మిక్కులు జనాలకు చిర్రెత్తిస్తున్నాయి. ఇంతకీ మేటర్ ఏంటంటే..

ఇంతకుముందు సుందర్ దర్శకత్వంలో ‘ఆరణ్మయి’ అనే హార్రర్ సినిమా చేసింది లక్ష్మీరాయ్. అప్పట్లో తనకు దయ్యం కలలు వస్తున్నాయని.. అర్ధరాత్రి పూట ఏవో వింత ఆకారాలు కనబడుతున్నాయని హడావుడి చేసిందామె. ఫస్ట్ టైం కాబట్టి జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఐతే ఇప్పుడు ‘షౌకార్ పేట్టై’ అనే ఇంకో హార్రర్ మూవీ చేస్తోంది లక్ష్మీరాయ్. ఇందులో ఆమే హీరోయిన్ కూడా. ఐతే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసిందామె. ఐతే ఓ రోజు షూటింగ్ అయిపోయాక వెళ్లి పడుకుంటే హఠాత్తుగా మెలకువ వచ్చి చూస్తే.. తన గది బయట ఓ ఫ్లాష్ కనిపించిందని చెప్పింది లక్ష్మీరాయ్. దాంతో పాటు ఓ వింత శబ్దమేదో వినిపించిందట. హోటల్ సిబ్బందికి చెబితే వాళ్లు లైట్ తీసుకున్నారట. కానీ తర్వాత కాసేపటికి మళ్లీ అలాగే ఫ్లాష్ కనిపించిందట. తర్వాత దేవుడి శ్లోకాలు చదువుకుని నిద్రపోయిందట. ఈ కథంతో పత్రికతో చెప్పుకుంది లక్ష్మీరాయ్. ఐతే ఎప్పుడూ వార్తల్లో ఉండాలని తపించే లక్ష్మీరాయ్ ఇలాంటి మాటలు చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదని కోలీవుడ్ జనాలు లైట్ తీసుకుంటున్నారు. తన సినిమా పబ్లిసిటీ కోసమే ఈ మాటలు చెబుతోందంటున్నారు.