Begin typing your search above and press return to search.

రెండో జూలీ కోసం కొత్త జూలీ తగ్గట్లేదుగా

By:  Tupaki Desk   |   3 May 2016 9:30 AM GMT
రెండో జూలీ కోసం కొత్త జూలీ తగ్గట్లేదుగా
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ లో 'తోబ తోబ' ఐటెం సాంగ్ లో చిందులేసింది రాయ్ లక్ష్మీ. ఇప్పుడీ భామ బాలీవుడ్ అరంగేట్రం చేసేస్తోంది. 12 ఏళ్ల క్రితం విడుదలైన జూలీ చిత్రానికి లేటెస్ట్ ఎడిషన్ గా రూపొందుతోంది జూలీ. ఈ మూవీలో రాయ్ లక్ష్మీనే లీడ్ హీరోయిన్. ఇప్పటికే కొన్ని లుక్ లు - పోస్టర్లతో కుర్రకారును విపరీతంగా ఆకట్టుకున్న రాయ్ లక్ష్మి.. జూలీ కోసం తానెంతగా కష్టపడుతోందో చెప్పుకొస్తోంది.

'జూలీ2 లో కేవలం స్కిన్ షో మాత్రమే కాదు.. బోలెడంత డ్రామా - మరెన్నో ఎమోషన్స్ కలగలిపి ఉంటాయి. నా యాక్టింగ్ ట్యాలెంట్ ను పూర్తిగా బయటపెట్టే సినిమా ఇది. జూలీ సీక్వెల్ లో నటించే ఛాన్స్ రావడం నాకు దక్కిన ఓ గొప్ప అవకాశంగా భావిస్తున్నా' అంటోంది రాయ్ లక్ష్మి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. త్వరలో దుబాయ్ లో మరుసటి షెడ్యూల్ కి వెళుతున్నారు. జూలీ2 మూవీలో కుప్పలు తెప్పలుగా బికినీ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇందుకోసం పర్ఫెక్ట్ బికినీ బాడీ షేప్ సంపాదించడానికి.. రాయ్ లక్ష్మి తెగ కష్టపడిపోతోంది. రోజుకు 5-6 గంటలు జిమ్ లోనే గడిపేస్తోందట కూడా.

అయితే.. ఓ సూపర్ హిట్ మూవీ సీక్వెల్ తో అరంగేట్రం చేసేటపుడు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్స్ పెక్టేషన్స్ ఏ మాత్రం రీచ్ కాకపోయినా.. కెరీర్ అటకెక్కేసే ప్రమాదం ఉంటుంది. అందుకే జూలీ2 కోసం తనలోని ట్యాలెంట్ తో పాటు.. అందాలను కూడా ఉపయోగించేస్తోంది రాయ్ లక్ష్మి.