Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బైక్ పై తేలుతున్న అందాలు

By:  Tupaki Desk   |   21 May 2018 5:21 PM GMT
ఫోటో స్టోరి: బైక్ పై తేలుతున్న అందాలు
X

అప్పుడెప్పుడో 13 ఏళ్ల కిందట కాంచన మాల కేబుల్ టీవీ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన లక్ష్మి రాయ్ వయస్సులో పెద్దగా మార్పులు వచ్చినట్టు అనిపించడం లేదు. గ్లామర్ లో అప్ గ్రేడ్ అయినా కూడా ఇంకా ఏజ్ లో మాత్రం పదహారేళ్ల అమ్మాయిలనే కనిపిస్తోంది. ఆ అందానికి సీక్రెట్ ఏమిటో గాని అమ్మడు ఎంత అందంగా ఉన్నప్పటికీ కెరీర్ లో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ఎక్కువగా చేయలేదు.

దాదాపు అన్ని ఇండస్ట్రీలను టచ్ చేసింది. ఎక్కువగా ఐటెమ్ సాంగ్స్ తో తన గుర్తింపును పెంచుకుంది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే అప్పుడపుడు ఫొటోలతో హల్ చల్ చేసే ఈ బ్యూటీ రీసెంట్ గా ఇచ్చిన కొన్ని స్టిల్స్ తో కూడా ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. హార్డ్ లీ డేవిడ్ సన్ బైక్ పై సెక్సీగా స్టిల్ ఇచ్చిన వైట్ అందాల్లో బ్లాక్ డ్రెస్ కొత్తగా అనిపిస్తోంది. ఇక లెగ్స్ అందాలు మతి పోగొడుతున్నట్లు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మనలో ఒక మృగం ఉంటుంది.. దాన్ని కొందరు సరిగ్గా ఉపయోగించుకోరు అని ఓ సందేశాన్ని ఇస్తూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం లక్ష్మి రాయ్ మలయాళం సినిమాలతో బిజీగా ఉంది. అలాగే ఓ తమిళ్ సినిమా కూడా చేసింది. వాటిలో కొన్ని రిలీజ్ కావడానికి రెడీగా ఉన్నాయి.