Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ కి లక్ష్మీరాయ్ అంత న‌చ్చిందా?!

By:  Tupaki Desk   |   1 Dec 2015 4:55 AM GMT
ప‌వ‌న్‌ కి లక్ష్మీరాయ్ అంత న‌చ్చిందా?!
X
తెలుగులో ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ స‌ర‌స‌న న‌టించాల‌నేది ప్ర‌తీ క‌థానాయిక క‌ల‌. అనుష్క‌ లాంటి అగ్ర క‌థానాయిక సైతం ఇటీవ‌ల ఓ టీవీ కార్య‌క్ర‌మంలో `ప్లీజ్... ప‌వ‌న్‌ కి మీరైనా చెప్ప‌రా?` అంటూ త‌న కోరిక‌ని వెలిబుచ్చింది. దీన్నిబ‌ట్టి ప‌వ‌న్ మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఆకాశ‌మే హ‌ద్దు అన్న‌ట్టుగా మాస్ జ‌నాల్లో క్రేజ్‌ ని సంపాదించుకొన్న ప‌వ‌న్‌ తో క‌లిసి న‌టిస్తే ఇక తిరుగుండ‌ద‌ని న‌వ‌త‌రం భామ‌లు న‌మ్ముతుంటారు. ప‌వ‌న్ హీరోయిన్ అనిపించుకోవాల‌ని అంద‌రూ అంత‌గా త‌పిస్తున్నారు కానీ... ఇటీవ‌ల ఓ భామ‌కి మాత్రం ఎవ్వ‌రూ ఊహించ‌ని రీతిలో ఆ అవ‌కాశం ల‌భించింది. దీంతో ఆమె ఆనందానికి అవ‌ధుల్లేవు. ఆ క‌థానాయిక ఎవ‌రో కాదు.. ల‌క్ష్మీరాయ్‌.

స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ సినిమాలో ఓ ఐటెమ్ పాట‌కోసం ల‌క్ష్మీరాయ్‌ ని ఎంచుకున్న విష‌యం తెలిసిందే. ఆ అవ‌కాశం ల‌భించేస‌రికి ఆమె ఎగిరి గంతేసింది. కాల్షీట్లు స‌మ‌స్య‌గా ఉన్నా ప‌వ‌న్ కోసం స‌ర్దుబాటు చేసింది. కొంత‌కాలం క్రిత‌మే ఆమె ఆ పాట‌లో ఆడిపాడి త‌న పార్ట్‌ ని పూర్తి చేసుకొని వెళ్లిపోయింది. అయితే ఇప్పుడామెకి మ‌ళ్లీ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ టీమ్ నుంచి పిలుపొచ్చిందట‌. ఐటెమ్ పాట‌తో పాటు ఓ పాత్ర కూడా క్రియేట్ చేశామ‌నేది ఆ పిలుపు సారాంశ‌మ‌ట‌. దీంతో ఇదో బంప‌ర్ ఆఫ‌ర్‌ లా భావిస్తోంద‌ట ల‌క్ష్మీరాయ్‌.

సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న మెయిన్ హీరోయిన్‌ గా కాజ‌ల్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. క‌థ రీత్యా మ‌రో అమ్మాయికి కూడా చోటుంద‌ట‌. ఆ పాత్ర‌కోసం ఎవ‌ర్ని ఎంపిక చేసుకుందామా అన్న ఆలోచ‌న‌లో చిత్ర‌బృందం ఉండ‌గా ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ మాత్రం మ‌ళ్లీ ల‌క్ష్మీరాయ్‌ నే పిలిపించండ‌ని చెప్పాడ‌ట‌. రెండో హీరోయిన్ అవ‌స‌రం లేకుండా ఆ పాత్ర‌ని ల‌క్ష్మీరాయ్‌ తోనే లాగించేద్దామ‌ని చెప్పాడ‌ట. ప‌వ‌న్‌ కి ల‌క్ష్మీరాయ్ బాగా న‌చ్చ‌డంతోనే క‌థ‌లో చిన్న చిన్న మార్పులు చేసి ఆమెకోసం పాత్ర‌ని పెంచిన‌ట్టు తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ ల‌క్ష్మీరాయ్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ టీమ్‌ తో జాయిన్ అవ్వ‌బోతున్న‌ట్టు తెలిసింది.